హార్దిక్ పాండ్యా‌ను కాపాడుకోవాలి.. ఒక్క టీ20ల్లోనే ఆడించాలి: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి సెలెక్టర్లకు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక సలహా ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాలని సూచించాడు. దాని కోసం అతన్ని మెగా టోర్నీ వరకు కేవలం టీ20ల్లో మాత్రమే ఆడించాలని, వన్డే, టెస్ట్‌లకు దూరంగా ఉంచాలని చెప్పాడు. హార్దిక్ ఫిట్‌గా ఉంటే జట్టులోని ఇద్దరి ఆటగాళ్లతో సమానమని చెప్పాడు. అంతేకాకుండా హార్దిక్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్దిక్ పాండ్యా వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో పాటు కెప్టెన్‌గా సత్తా చాటి గుజరాత్ టైటాన్స్‌కు తొలి టైటిల్ అందించాడు. 15 మ్యాచ్‌లు ఆడి 487 పరుగులతో పాటు, 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో 3/17 బెస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు ఓటమిని శాసించాడు. ఈ ప్రదర్శనతో హార్దిక్ మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు.

ఈ క్రమంలోనే హార్ధిక్‌ పాండ్యాపై రవిశాస్త్రి ఆసక్తకిర వాఖ్యలు చేశాడు. "హార్ధిక్‌ పాండ్యాకు జట్టులో బ్యాటర్‌గా లేదా ఆల్‌రౌండర్‌గా చోటు దక్కింది. అయితే అతను గాయం నుంచి కోలుకున్నప్పటికీ కేవలం 2 ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత హార్ధిక్‌కు మంచి విశ్రాంతి లభించింది. ఇకపై కూడా అతనికి చాలా విశ్రాంతి అవసరం. హార్ధిక్‌ను టీ20 ప్రపంచకప్‌ వరకు వన్డేల్లో ఆడించే ప్రయత్నం చేయకూడదు. అతను టీ20 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలా ముఖ్యం. ఫిట్‌గా ఉంటే హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరి ఆటగాళ్లతో సమానం. పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో అయినా అద్భుతంగా ఆడగలడు'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 6, 2022, 21:55 [IST]
Other articles published on Jun 6, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X