న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rachin Ravindra అంటే రాహుల్ ద్రవిడ్+ సచిన్ టెండూల్కర్! మనోళ్లే మన విజయాన్ని అడ్డుకున్నారు!

Rachin Ravindra Named After Rahul Dravid And Sachin Tendulkar Saved The Test On His Debut Match

కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్‌ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ముఖ్యంగా న్యూజిలాండ్ అరంగేట్ర ప్లేయర్ రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని లాగేసాడు. భారత సంతతికే చెందిన రచిన్ రవీంద్ర.. తన ఫస్ట్ టెస్ట్‌లోనే దుమ్ములేపాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్ రవీంద్ర.. 91 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఓటమికి అడ్డుగోడలా నిలిచాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు వికెట్లు కోల్పోయినా.. మరో ఎండ్‌లో ఆజాజ్ పటేల్ సాయంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.

ద్రవిడ్ + సచిన్ టెండూల్కర్..

ద్రవిడ్ + సచిన్ టెండూల్కర్..

భారత్‌లోని పుట్టిన రచిన్ రవీంద్ర.. ఇక్కడి పిచ్‌లపై క్రికెటర్‌గా రాటుతేలిన వాడే. అనంతపురంల ట్రెయినింగ్ తీసుకున్న రచిన్ రవీంద్ర.. క్రీజులో అడ్డుగోడగా నిలబడ్డాడు. అయితే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లపై ఉన్న అభిమానంతో రచిన్ రవీంద్రగా పేరు పెట్టుకున్నారు. దాంతో రచిన్ రవీంద్రపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఆ పేరులోనే మహిమ ఉందని, అందుకే ఓటమి నుంచి గట్టెక్కించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన రచిన్ రవీంద్ర ఇక్కడ అవకాశాలు రావని భావించి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. అక్కడ ఒక్కో మెట్టు ఎదిగి.. న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఆజాజ్ పటేల్ సైతం..

ఆజాజ్ పటేల్ సైతం..

11వ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ఆజాజ్ పటేల్ సైతం భారత్‌కు చెందిన వాడే. ముంబైలో పుట్టిన అతను న్యూజిలాండ్‌కు వలసకు వెళ్లాడు. 9 వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజాజ్ పటేల్.. 23 బంతులు ఎదుర్కొన్నాడు. స్పిన్నర్లు అయినటు వంటి ఆజాజ్ పటేల్, రచిన్ రవీంద్రలకు భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉందనే వారిని తుది జట్టులోకి తీసుకున్నారు. వారు కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

అంపైర్‌పై విమర్శలు..

ఇక భారత్ ఓటమికి భారత అంపైర్ నితీన్ మీనన్ కూడా కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చివరి రోజు ఆట చివర్లో ప్రతీ ఓవర్ ముందు లైట్ మీటర్ పట్టుకొని నితీన్ మీనన్ ఓవరాక్షన్ చేశాడని మండిపడుతున్నారు. దాని వల్ల టీమిండియా సమయం వృథా అయిందంటున్నారు. అయితే నితీన్ మీనన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. లైట్ మీటర్‌తో వెలుతురును చెక్ చేయడం అంపైర్ల బాధ్యతని, ఎలాంటి పక్షపాతం లేకుండా నితీన్ వ్యవహరించాడని కొనియాడుతున్నారు. లేకుంటే భారత జట్టు, అంపైర్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేవంటున్నారు.

వికెట్ దూరంలో చేజారిన విజయం..

వికెట్ దూరంలో చేజారిన విజయం..

ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రాచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది. 4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 29, 2021, 17:50 [IST]
Other articles published on Nov 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X