న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్ ఆడేందుకే పుట్టాడు.. కిక్కు తలకెక్కించుకోకపోతేనే...'

India vs West Indies 2018 : Prithvi Shaw Resembles Sehwag And Lara: Ravi Shastri | Oneindia Telugu
Prithvi Shaw is born to play cricket, says Ravi Shastri

న్యూ ఢిల్లీ: టీమిండియాకు దొరికిన మరో యువ బ్యాట్స్‌మన్.. ఓపెనింగ్ సంచలనం అరంగ్రేట మ్యాచ్ నుంచి అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షాపై భారత కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఓపెనింగ్‌ సంచలనం పృథ్వీ షాలో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ సచిన్, సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారని రవిశాస్త్రి అన్నారు. రెండో టెస్టూలోనూ వెస్టిండీస్‌పై భారీ విజయాన్నందుకున్న టీమిండియా గురించి రవిశాస్త్రి ముచ్చటించాడు.

ఎనిమిదేళ్ల నుంచే ముంబైలోని మైదానాల్లో

ఎనిమిదేళ్ల నుంచే ముంబైలోని మైదానాల్లో

పృథ్వీ షా క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ముంబైలోని మైదానాల్లో ఆడడం ప్రారంభించాడు. ఆ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తోంది. షా ప్రేక్షకులను అలరించే బ్యాట్స్‌మన్‌. సచిన్‌ను తలపిస్తున్నాడు. సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్నాడు. గ్రౌండ్‌లోకి వచ్చేటప్పుడు లారాలాగా కనిపిస్తున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుండా ఇలాగే కష్టపడితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది.'

హైదరాబాద్ టెస్టులో భారత్ విజయం: 2-0తో టెస్టు సిరిస్ కైవసం

కపిల్‌ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్‌ యాదవ్‌

కపిల్‌ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్‌ యాదవ్‌

టెస్టుల్లో 10 వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజాలైన కపిల్‌ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్‌ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. జట్టుకు తాను విలువైన బౌలర్‌నని ఉమేశ్‌ తాజా ప్రదర్శనతో చాటుకున్నాడు. . శార్దుల్‌ ఓ సెషన్‌లో దూరమైతే ఉమేశ్‌ ఆ స్థానాన్నీ భర్తీ చేశాడని, పది వికెట్లు తీయగలిగాడని దీంతో జట్టు ఏ ఒక్కరిమీద ఆధారపడలేదనే విషయం స్పష్టమవుతుందని కోచ్‌ వివరించాడు.

జట్టు ఏ ఒక్కరిమీదో ఆధారపడలేదనే విషయం

జట్టు ఏ ఒక్కరిమీదో ఆధారపడలేదనే విషయం

వృద్ధిమాన్‌ సాహాకు పంత్‌ నుంచి ఏర్పడిన పోటీపై స్పందిస్తూ... ఇవన్నీ సానుకూలాంశాలన్నాడు. ఒకరు లేకపోతే ఇంకొకరు సత్తా చాటుతున్నారని చెప్పాడు. ఓపెనర్‌ రాహుల్‌ టచ్‌లోకి వచ్చాడు. అతను ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు బాగా కష్టపడతాడు. ఈ మ్యాచ్‌లో నాకదే కనిపించింది. ఈ వరుసలో తాజాగా రిషభ్‌ పంత్‌ వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు' అని రవిశాస్త్రి అన్నాడు.

రెండో టెస్టును సైతం మూడు రోజుల ముచ్చటగానే

రెండో టెస్టును సైతం మూడు రోజుల ముచ్చటగానే

తొలి రోజు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బాగానే పోరాడారు. రెండో రోజు ప్రత్యర్థి బౌలర్లూ సవాలు విసిరారు. మూడో రోజూ ఉదయమూ భారత్‌కు కాస్త ప్రతికూల వాతావరణం నెలకొనడంతో పోటీ తప్పదేమో.. విజయం కోసం కష్టపడాల్సి ఉంటుందేమో.. అనుకున్నారంతా! కానీ, అనూహ్యంగా కరీబియన్‌ జట్టు పాత దారిలోకి వెళ్లిపోయి రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేసింది. నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ రెండో టెస్టును సైతం మూడు రోజుల ముచ్చటగానే ముగించింది.

1
44265
Story first published: Monday, October 15, 2018, 8:26 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X