For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్టులో భారత్ విజయం: 2-0తో టెస్టు సిరిస్ కైవసం

2nd Test Day 3 in Hyderabad

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు.

దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ని మూడు రోజుల్లోనే ముగించింది. ఈ టెస్టు విజయం సొంతగడ్డపై టీమిండియాకు వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1
44265

10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసి 56 పరుగులు ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 127 పరుగులకే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. తద్వారా టెస్ట్ కెరీర్‌లో పది వికెట్లు తీయడం ఉమేష్‌కు ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌కి తోడు జడేజా 3 వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. కుల్డీప్‌ యాదవ్ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఆటలో భాగంగా ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పేసర్ ఉమేశ్ యాదవ్ విండీస్‌కు ఊహించని షాకిచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం మరో ఓపెనర్ కీరన్ పావెల్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ అశ్విన్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. దీంతో కేవలం 9 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది.

విండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్‌, హెట్‌మైర్‌‌లు ఆచితూచి ఆడేప్రయత్నం చేశారు. అయితే, ఆ తర్వాత రెండు వరుస ఓవర్లలో షెయ్ హోప్(28), హెట్‌మెయిర్(17) వికెట్లు పడగొట్టిన టీమిండియా మ్యాచ్‌లో పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోస్టన్ ఛేజ్(6) కూడా వెనుదిరగడం... అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. వెస్టిండిస్ బ్యాట్స్‌మన్లలో సునీల్‌ అంబ‍్రిస్‌(38) టాస్ స్కోరర్‌గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకే భారత్ ఆలౌట్

అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 59 పరుగులు మాత్రమే జోడించింది. మూడోరోజైన ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్ నైట్ ఆటగాడు రహానే(80) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు.

 తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న రిషభ్ పంత్

తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న రిషభ్ పంత్

రెండో రోజు ఆటలో అద్భుత ఆటతీరు కనబరిచిన రిషబ్ పంత్ తృటిలో మూడో రోజు తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుల్దీప్(6), ఉమేశ్‌లు(2) కూడా వెంట వెంటనే ఔటయ్యారు.

ఐదు వికెట్లు పడగొట్టిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్

అయితే రవిచంద్రన్ అశ్విన్(35) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించగా.. గాబ్రియేల్ బౌలింగ్‌లో పదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 367 పరుగుల దగ్గర టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వెస్టిండీస్ బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐదు వికెట్లు తీయగా.. గాబ్రియేల్ మూడు వికెట్లు తీసుకోగా, వారికమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, October 14, 2018, 17:55 [IST]
Other articles published on Oct 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+