న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెటర్లను తొక్కేస్తున్నారు.. బాబర్ అజమ్ కోహ్లీ అయ్యుంటేనా..

Nasser Hussain Says If he was Virat Kohli everyone would be talking but because it is Babar Azam

లండన్: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్‌ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతను రావాల్సిన గుర్తింపు రావడం లేదన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతన్న ఫస్ట్ టెస్ట్‌లో బాబర్ ఆజామ్ హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ బ్యాటింగ్‌ను కొనియాడిన నాజర్ హుస్సేన్ అతని స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఉండి ఉంటే ఈ క్రికెట్ ప్రపంచం వేరేలా స్పందించి ఉండేదన్నాడు.

ఇక నుంచి ఫాబ్-5

ఇక నుంచి ఫాబ్-5

స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. 'బాబర్ గొప్ప ఆటగాడు. అతడిని కావాలనే తొక్కేస్తున్నారు. 2018 నుంచి టెస్టుల్లో బాబర్ సగటు 68, వన్డేల్లో 55 సగటు. ఇంత గొప్పగా ఆడుతున్నా అతడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇదే స్థాయిలో భారత కెప్టెన్ కోహ్లీ రాణిస్తుంటే అతడికి ఎంతో గుర్తింపు వచ్చేది. తొలి రోజే అర్థసెంచరీ చేశాడంటూ సీనియర్లంతా అతడిని ఆకాశానికి ఎత్తేవారు. ఇప్పటి వరకు ఫాబ్ ఫోర్ స్టీవ్‌ స్మిత్‌, కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, జోరూట్‌ల గురించే మాట్లాడేవారు. ఇప్పుడు బాబర్‌తో కలిపి ఫాబ్ 5 అంటారు.

బీసీసీఐనే కారణం..

బీసీసీఐనే కారణం..

పాక్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు రాకపోడానికి భారత క్రికెట్ బోర్డే కారణం. ఐపీఎల్‌లో పాక్‌ ఆటగాళ్లను అనుమతించడంలేదు. అలాగే పాక్‌తో ఒక్క సిరీస్ ఆడేందుకు కూడా భారత్ సుముఖంగా లేదు. దీంతో ఇతర దేశాలతో ఆడే సిరీస్‌ల విషయంలోనూ పాక్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్వదేశానికి దూరంగా యూఏఈలో మ్యాచ్‌లను నిర్వహించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల పీసీబీ ఆర్థికంగా నష్టపోతోంది. బీసీసీఐ ధన బలంతో పీసీబీని, అక్కడి ఆటగాళ్లను తొక్కేస్తుంది'అని నాజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అజామ్‌తో ఇంగ్లండ్‌కు కష్టం..

అజామ్‌తో ఇంగ్లండ్‌కు కష్టం..

ఇంగ్లండ్‌కు అజామ్‌ నుంచి ప్రమాదం పొంచి ఉందన్నాడు. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఏవిధంగా ఇంగ్లండ్‌పై చెలరేగిపోయాడో, అదే విధంగా ఇప్పుడు అజామ్‌ చుక్కలు చూపించడం ఖాయమన్నాడు. స్మిత్‌ ఆట అజామ్‌లో చూస్తున్నానంటూ వాన్‌ కొనియాడాడు. ఇక నిన్నటి ఆటలో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ కొట్టడంలో విఫలమైన అజామ్‌.. ఈరోజు ఆ షాట్‌ను ఆడటానికి దూరంగా ఉంటాడన్నాడు.

మసూద్ సెంచరీ..

మసూద్ సెంచరీ..

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాక్ జోరు కొనసాగుతుంది. ఓపెనర్ షాన్ మసూద్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై శతకం బాదిన పాక్ ఓపెనర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇన్నేళ్ల తర్వాత 200 ప్లస్ బాల్స్ ఎదుర్కొన్న పాక్ ఓపెనర్ కూడా షాన్ మసూదే కావడం గమనార్హం.1996లో సయీద్ అన్వర్ చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేశాడు.

200 పైగా బంతులు ఆడింది కూడా ఈ మాజీ ఓపెనరే. ఇక షాన్ మసూద్ సెంచరీకి షాదాబ్ ఖాన్(45) తోడవడంతో పాకిస్థాన్ ఫస్ట్ టెస్ట్‌లో పట్టు బిగించింది. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం పాక్ 99 ఓవర్లలో 6 వికెట్లకు 286 రన్స్ చేసింది. క్రీజులో షాన్ మసూద్(126 బ్యాటింగ్)తో పాటు యాసిర్ షా(5 బ్యాటింగ్) ఉన్నారు.

24 ఏళ్ల తర్వాత పాక్ ఒపెనర్ షాన్ మసూద్ అరుదైన ఘనత!

Story first published: Thursday, August 6, 2020, 21:05 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X