
ఆదిలోనే గట్టి షాక్..
అంతకు ముందు 139/2 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. తొలి రోజు ఆటలో అర్ధశతకంతో సత్తాచాటిన బాబర్ అజామ్(69) రెండో రోజు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ భారీ స్కోరు దిశగా సాగుతున్న బాబర్‌ను ఔట్ చేసి ఇంగ్లీష్ జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. అనంతరం అసద్ షఫీక్ క్రీజులోకి రాగా.. ఓపెనర్ షాన్ మసూద్ 156 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరుసగా 6 ఓవర్లు మెయిడిన్
ఆ వెంటనే అసద్ షఫీఖ్(7)ను బ్రాడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో వరుసగా ఆరు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. ఆతిథ్య బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మన్ బెంబేలెత్తిపోయారు. ఏకంగా 41 డాట్ బాల్స్ తర్వాత పాక్ పరుగు సాధించింది. వోక్స్ వేసిన 61వ ఓవర్లో రిజ్వాన్ 2 రన్స్ రాబట్టడంతో పాక్ స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఆ వెంటనే రిజ్వాన్‌ను క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్‌గా పెలియన్ చేర్చాడు. దీంతో పాక్ 176 రన్స్‌కే 5 కీలక వికెట్లు కోల్పోయింది. మరో వికెట్ పడకుండా మసూద్ జాగ్రత్త పడటంతో పాక్ 187/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

మసూద్ సూపర్ షో..
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మసూద్ మాత్రం ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు కదిలించాడు. లంచ్ విరామం అనంతరం షాదాబ్ ఖాన్ సాయంతో ఆతిథ్య బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు. కొంచెం కుదురుకున్నాక వేగం పెంచాడు. వరుస ఓవర్లలో బౌండరీలు తరలిస్తు స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో 251 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీ చేయడానికి 151 బంతులు ఆడిన మసూద్.. మరో 50 పరుగులను 100 బంతుల్లోనే పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీకి సమీపించిన షాదాబ్ ఖాన్‌ను డామ్ బెస్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

బాబర్ ఫిఫ్టీ..
ఇక వర్షం అంతరాయంతో 49 ఓవర్లపాటే సాగిన తొలి రోజు ఆటలో బాబర్ ఆజామ్ సూపర్ ఫిఫ్టీతో పాక్ పై చేయి సాధించింది. 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన బాబర్.. ఇన్నింగ్స్ గట్టెక్కించాడు. ఆరంభంలో కాస్త తడబడిన బాబర్ ఆజమ్ క్రీజులో కుదురుకున్నాక బౌండరీల మోతమోగించాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో ఎదుర్కొన్న 22 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసిన బాబర్.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బాబర్ అండతో మసూద్ కూడా చెలరేగాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు.
నా జీవితంలోనే బ్యాట్ పట్టకుండా ఇన్ని రోజులు ఉండలేదు: రోహిత్ శర్మ


Click it and Unblock the Notifications
