
ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం
యువకులు ధోనీని బ్యాటింగ్, కీపింగ్ విభాగాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. ‘ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. బ్యాటింగ్ పరంగా పంత్ బాగున్నాడు. వికెట్ కీపింగ్‌లో బంతులు అందుకునేందుకు కచ్చితమైన టెక్నిక్, చురుకుదనం, చక్కని చూపు అవసరం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కళ్లద్దాలు ధరిస్తున్నారు. మంచి చూపు ఉన్నప్పుడు కళ్లద్దాలు ఎందుకు? '
తప్పులు చేస్తున్నాడు: టెస్టు క్రికెట్‌లో పంత్ ఇంకా పరిణితి సాధించాలి

బౌలర్ టర్న్ తీసుకొనే వరకు కూర్చొని
'వాటితో బంతి వంపు, దిశలో కాస్త మార్పు కనిపిస్తుంది. దాంతో క్యాచ్‌లు చేజారొచ్చు. బౌలర్ టర్న్ తీసుకొనే వరకు పంత్ కూర్చొని ఉండాలి. బంతి పిచ్ అయి ఎటువెళ్తుందో చూసే వరకు కూర్చొని ఉండాలి. ఆ తర్వాత స్వింగ్, బౌన్స్‌కు అనుగుణంగా కదలాలి. స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్ ఎప్పుడు లేస్తున్నాడన్న దానిపైనే అతడి సామర్థ్యం ఏంతో తెలుస్తుంది. 'అని కిర్మాణీ అన్నాడు.

ఇది టెక్నిక్ కాదు. నియమం
'పంత్ ఫీల్డర్లు విసిరిన బంతిని అందుకొనేందుకు ధోనీని అనుకరిస్తున్నాడు.మహీ వికెట్ల ముందు నిలబడి బంతి అందుకుంటాడు. ఎప్పుడైనా సరే వికెట్ల వెనకాల ఉండి బంతిని అందుకోవడం సరైన పద్ధతి. ఇది టెక్నిక్ కాదు. నియమం. అప్పుడే కీపర్ కంటి స్థాయి బెయిల్స్‌ను చూసేందుకు, బంతి ఎక్కడ పిచ్ అవుతుందో తెలుసుకునేందుకు సులభంగా ఉంటుంది.

నా అనుభవం వృథా అవుతోంది
కేవలం ఇలా చెప్పడమే సరికాదు. దానిని చేసి చూపించాలి. వికెట్ కీపర్‌తో మాట్లాడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు నన్ను ఇప్పటి వరకు పిలవలేదు. ఇందుకు చాలా నిరాశపడుతున్నా. నా అనుభవం వృథా అవుతోంది' అని సయ్యద్ కిర్మాణీ వెల్లడించాడు.