న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్స్ ధోనీ, రోహిత్

MS Dhoni, Rohit Sharma declared joint-best IPL captains
IPL 2020 : IPL's GOATs Including Captain, Batsmen, Bowler, All Rounder

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐాపీఎల్) ఆల్‌ టైమ్‌ బెస్ట్ కెప్టెన్స్‌గా మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్‌ శర్మ ఎంపికయ్యారు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్ కనెక్టడ్ షోలో భాగంగా 50 మందితో కూడిన నిపుణుల జ్యూరీ ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్స్ జాబితాను ప్రకటించింది.

ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 సీజన్లలో 10 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మూడు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2013 నుంచి సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాలుగు సార్లు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఇద్దరిని ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్స్‌గా ఎంపిక చేశారు.

ఇక ఆల్‌ టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌, బౌలర్‌గా శ్రీలంక పేసర్‌ లసిత్ మలింగ ఎంపికయ్యారు. చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆసీస్‌ మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ,కివీస్ మాజీ క్రికెటర్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యారు.

ఆ ట్వీట్ తొలగించు.. బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాలా స్వీట్ వార్నింగ్ఆ ట్వీట్ తొలగించు.. బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాలా స్వీట్ వార్నింగ్

ఐపీఎల్‌లో భారత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రకటించారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (5412 పరుగులు) అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 50 మందితో కూడిన ఈ స్టార్‌స్పోర్ట్స్‌ నిపుణుల జ్యూరీలో 20 మంది మాజీ క్రికెటర్లు, 10 మంది సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, 10 మంది స్టాటస్టికల్ విశ్లేషకులు ఉన్నారు.

ఇక కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇది అమలులో ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి పరిస్థితిలు అన్ని అనుకూలంగా ఉంటే మార్చి 29నే ఐపీఎల్ ప్రారంభమయ్యేది. కానీ కరోనా పుణ్యమా ఈ క్యాష్ రీచ్ లీగ్ నిర్వహణ కష్టంగా మారింది.

Story first published: Sunday, April 19, 2020, 12:04 [IST]
Other articles published on Apr 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X