న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 నెలల్లో 15 క్రికెట్ సిరీస్‌లు రద్దు.. ఎక్కడి గత్తరనో ఏమో దీని పీనుగెల్ల!

More than 150 Days of International Cricket postponed, cancelled in last 12 months

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం కుదేలైంది. ఎక్కడి గత్తరనో ఏమో గానీ ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లు అయితే భారీ సంఖ్యలో రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగింది. డబ్బున్న క్రికెట్ బోర్డులు బయో బబుల్ ఏర్పాటు చేసి ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించినా.. చిన్న బోర్డులపై మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగామ్స్(ఎఫ్‌టీపీ)లో దాదాపు 150 రోజుల అంతర్జాతీయ క్రికెట్ తుడిచి పెట్టుకొనిపోయినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఓ కథనం పబ్లిష్ చేసింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థికంగా నష్టాల పాలయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్ టీ20 టోర్నీ రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఐసీసీతో పాటు ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) కూడా అర్థిక కష్టాలు పడాల్సి వస్తున్నది. ఒక్క బీసీసీఐ తప్ప అన్ని దేశాల క్రికెట్ బోర్డుల క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా కారణంగా ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తున్నది.

 ఐపీఎల్‌తో గట్టెక్కిన బీసీసీఐ..

ఐపీఎల్‌తో గట్టెక్కిన బీసీసీఐ..

క్రికెట్‌లో అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐ. దాంతోనే అది కరోనా దెబ్బను తట్టుకున్నా.. మిగతా బోర్డులన్నీ నష్టపోయాయి. టీమిండియా ఆడాల్సిన సౌతాఫ్రికా, శ్రీలంక ద్వైపాక్షిక పర్యటనలు రద్దయ్యాయి. కానీ కరోనా కష్టకాలంలోనూ గతేడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడం ద్వారా బీసీసీఐ భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఈ లీగ్‌తో బీసీసీఐకి పెద్దగా నష్టమేం రాలేదు. అదే సమయంలో ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డు సైతం రూ.100 కోట్లు ఆదాయాన్ని అందుకుంది. కానీ ఈ సీజన్ స్వదేశంలో నిర్వహించే ప్రయత్నం చేసిన బీసీసీఐ చేతులు కాల్చుకుంది. వైరస్ కారణంగా లీగ్ అర్థాంతరంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేను మరీ అంత చెత్త బౌలర్‌నా? కుల్దీప్ యాదవ్ అసహనం!

నష్టాల్లో క్రికెట్ బోర్డులు..

నష్టాల్లో క్రికెట్ బోర్డులు..

బీసీసీఐ తర్వాత డబ్బున్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు ఆర్థికంగా సతమతమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా ఏకంగా 70 శాతం మేర ఉద్యోగులను తొలగించింది. అంతేకాకుండా మిగిలిన 30 శాతం సిబ్బందితో పాటు ఆటగాళ్ల జీతాల్లో కోత విధించింది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. డబ్బున్న ఈ రెండు బోర్డులే నష్టాల పాలయ్యాయంటే ఇక క్రికెట్ సౌతాఫ్రికా, క్రికెట్ వెస్టిండీస్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్, బంగ్లాదేశ్ క్రికెట్ అప్పుల్లో కూరుకుపోయాయి. గత 12 నెలల్లో 15 అంతర్జాతీయ సిరీస్‌లు వాయిదా పడ్డాయి.

కుదేలైన మహిళా క్రికెట్‌..

కుదేలైన మహిళా క్రికెట్‌..

ఇప్పుడిప్పుడే ఆదరణకు నోచుకుంటున్న మహిళా క్రికెట్‌పై కరోనా దెబ్బ గట్టిగానే పడింది. ఈ మహమ్మారి కారణంగా మహిళా క్రికెట్ పూర్తిగా తుడిచి పెట్టుకొని పోయింది. గత కొన్ని నెలలుగా ద్వైపాక్షిక సిరీస్‌లు అసలు జరగడం లేదు. కేవలం ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరగాయి. ఇవి మినహా మరే సిరీస్‌లు జరగలేదు. అంతేకాకుండా ఈ ఏడాది జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ కూడా ఏడాది వాయిదా పడటంతో మహిళా క్రికెట్‌కు తీరని నష్టం చేకూరింది.

ఆగిపోయిన పురుషుల క్రికెట్ సిరీస్‌లు

ఆగిపోయిన పురుషుల క్రికెట్ సిరీస్‌లు

శ్రీలంక- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ (వాయిదా)

భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్(రద్దు)

పాకిస్థాన్-బంగ్లాదేశ్ (వాయిదా)

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ (రద్దు)

బంగ్లాదేశ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్(రద్దు)

పాకిస్థాన్ సూపర్ లీగ్(వాయిదా)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్(ఆస్ట్రేలియా వాయిదా)

ఆసియా కప్ టీ20 సిరీస్(వాయిదా)

సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా పర్యటన(రద్దు)

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(వాయిదా)

అఫ్గానిస్థాన్-జింబాబ్వే(వాయిదా)

సౌతాఫ్రికా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్(రద్దు)

Story first published: Wednesday, May 12, 2021, 15:47 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X