న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను మరీ అంత చెత్త బౌలర్‌నా? కుల్దీప్ యాదవ్ అసహనం!

Kuldeep Yadav says I started questioning myself… focussed on what others are saying

న్యూఢిల్లీ: కెరీర్ పరంగా తనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అసహనం వ్యక్తం చేశాడు. డ్రింక్స్ మోస్తూ పదే పదే బెంచ్‌కు పరిమితవ్వడం కష్టంగా ఉందన్నాడు. టీమ్‌తోనే ఉంటూ తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడం బాధగా ఉందని, తన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తాను ఇంత పనికి రాని బౌలర్‌నా? అనే సందేహం కూడా కలుగుతుందన్నాడు. ఆస్ట్రేలియాతో రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన కుల్దీప్‌... ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఆ మ్యాచ్‌లో 6.2 ఓవర్లు వేసిన కుల్దీప్‌.. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.

ఐపీఎల్‌లో కూడా..

ఐపీఎల్‌లో కూడా..

అంతేకాదు పుణెలో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అతన్ని పక్కనపెట్టేసింది. టెస్టులు, వన్డేల సంగతి ఇలా ఉంటే.. కుల్దీప్‌ 16 నెలలుగా ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతనికి ఈసారి ఒక్క అవకాశం దక్కలేదు. స్పిన్‌ విభాగంలో సునీల్‌ నరైన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, వరుణ్‌ చక్రవర్తిలను వాడుకున్న కేకేఆర్.. కుల్దీప్‌ను పక్కనపెట్టేసింది.

కాన్ఫిడెన్స్ పోయింది..

కాన్ఫిడెన్స్ పోయింది..

ఈ పరిణామాలన్నిటినీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన కుల్దీప్.. తాను చాలా అసహనానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. 'నాన్‌స్టాప్‌గా ఆడుతూ ఉంటే.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ప్రతిసారీ బెంచ్‌ మీదే కూర్చోవాల్సి వస్త పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నేను చాలా కాలం తర్వాత ఫిబ్రవరిలో చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడినపుడు ఇలాగే అనిపించింది. మరోవైపు కోవిడ్‌ కల్లోలం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మార్చింది. నాకు ఒక్కోసారి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కఠిన సమయాల్లో నా మనసు ఒకటే మాట చెబుతుంది.. నువ్వు మనుపటి కుల్దీప్‌ కాదేమో.. బహుశా అలా ఉండలేవేమోనని.. డ్రింక్స్‌ మోస్తూ... పదే పదే బెంచ్‌ మీద కూర్చోవడం.. చాలా కఠినంగా ఉంటుంది.'అని కుల్డీప్ చెప్పుకొచ్చాడు.

నేను మరీ అంతపనికిరాని వాడినా?

నేను మరీ అంతపనికిరాని వాడినా?

కేకేఆర్‌ తరఫున ఆడే అవకాశం రాకపోవడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.'నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా? అని అనిపించింది. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌ను అడగడం భావ్యం కాదు. కానీ చెన్నైలో నన్ను ఆడించకపోవడం నిజంగా షాక్‌కు గురిచేసింది. ఇక ఈ విషయాన్ని టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల దృష్టికి తీసుకెళ్లాను. వారు నన్ను మోటివేట్ చేశారు. కానీ టీమ్ కాంబినేషన్స్ వల్ల ఏం చేయలేకపోతున్నామని తెలిపారు.'అని కుల్దీప్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడే 24 మందితో కూడిన జట్టులోనూ కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే.

ధోనీ దూరమవ్వడం..

ధోనీ దూరమవ్వడం..

మహేంద్ర సింగ్ ధోనీ గైడెన్స్ లేకపోవడం కూడా తన వైఫల్యానికి ఓ కారణమని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. 'కొన్నిసార్లు నేను మహీ భాయ్ గైడెన్స్ మిస్సయ్యాను. ధోనీ భాయ్ వికెట్ల వెనుకాల ఉంటూ బ్యాట్స్‌మెన్ బలహీనతను తెలుసుకొని ఔట్ చేయడానికి కావాల్సిన చిట్కాలు చెప్పేవాడు. అతని అనుభవాన్ని మేం మిస్పవుతున్నాం. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ గేమ్‌ను రీడ్ చేసే సామర్థ్యం రావడానికి మరికొంత సమయం పడుతోంది. ప్రతీ బౌలర్‌కు తోడుగా మరో బౌలర్ ఉండటం ముఖ్యం. ధోనీ ఉన్నప్పుడు నేను, చాహల్ చాలా మ్యాచ్‌లు ఆడేవాళ్లం. కానీ మహీ భాయ్ దూరమవడంతో మా ఇద్దరికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. నేను ఓ 10 మ్యాచ్‌లు ఆడుంటా. హ్యాట్రిక్ కూడా తీసా. నా పెర్ఫామెన్స్‌ను మొత్తం పరిశీలిస్తే నేను మెరుగైన దశలోనే ఉంటా. కానీ కొన్నిసార్లు మార్క్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయా. బలమైన ప్రత్యర్థి కారణంగా కూడా విఫలమై ఉండొచ్చు'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, May 12, 2021, 13:58 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X