న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెళ్లిపై మాట్లాడేందుకు నిరాకరించిన మహ్మద్ సిరాజ్!

 Mohammed Siraj says Australian crowd abusing made me mentally strong

హైదరాబాద్: తన పెళ్లి గురించి మాట్లాడేందుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిరాకరించాడు. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్న ఈ హైదరాబాద్ గల్లీ భాయ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పెళ్లి కుదిరిందంట కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మాట్లాడేందుకు సిరాజ్ నిరాకరించాడు. అయితే సిరాజ్‌కు పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అంతులేని ఆత్మవిశ్వాసం లభించిందని, ఇకపై అన్ని సిరీసుల్లో మెరుగైన ప్రదర్శనలు చేసేందుకు ఇది పనికొస్తుందని సిరాజ్ పేర్కొన్నాడు. ఆసీస్‌ పర్యటనలో ఉన్నపుడు తన తండ్రి మరణవార్త మానసికంగా కలచివేసిందని... ఆయన కలను నిజం చేసేందుకే సిరీస్‌లో కొనసాగినట్లు స్పష్టం చేశాడు. భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ తనకు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

 విజయాన్ని తలకెక్కించుకోను..

విజయాన్ని తలకెక్కించుకోను..

'ప్రస్తుత ప్రదర్శననే మున్ముందు సిరీసుల్లో పునరావృతం చేయాలనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఆసీస్‌లో పనికొచ్చింది. లీగ్‌లో వార్నర్‌కు ఇన్‌స్వింగర్లు వేసేవాడిని. ఆసీస్‌లోనే అదే ప్రణాళిక అమలు చేశాను. ఈ విజయాన్ని తలకెక్కించుకోను. విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె ఇద్దరూ మంచి సారథులే. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, నాకూ అజింక్య ఎన్నో సలహాలు ఇచ్చాడు. మాలో ఆత్మవిశ్వాసం నింపాడు. విజయం దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించాలి. సవాళ్లను అధిగమిస్తే విజయవంతం అవ్వగలం. మున్ముందు సిరీసులను తీవ్రంగా తీసుకుంటాను. విశ్రమించే సమస్యే లేదు' అని సిరాజ్‌ తెలిపాడు.

 ప్రతిభ కావాలి

ప్రతిభ కావాలి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్, క్రికెట్లో అవినీతి గురించి ప్రశ్నించగా.. ఆటపై అభిమానం, తగినంత శ్రమిస్తే ఎవరికైనా అవకాశాలు వస్తాయని సిరాజ్ తెలిపాడు. 'క్రికెట్లో అవినీతి జరుగుతుందనడం అవాస్తవం. ప్రతిభ ఉంటే డబ్బులతో పనిలేదు. క్రికెట్లో డబ్బులు తీసుకుంటారన్నది నిజం కాదు.' అని సిరాజ్‌ స్పష్టం చేశాడు. ఒకప్పుడు రంజీల్లో హనుమ విహారి తనకు సారథని ఏయే బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి బంతులు వేయాలో సలహాలు ఇచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. తనకెంతో మద్దతుగా నిలిచేవాడని పేర్కొన్నాడు.

బ్రౌన్ మంకీ అన్నారు..

బ్రౌన్ మంకీ అన్నారు..

ఆస్ట్రేలియా ప్రేక్షకులు తనపై మాటలతో దాడి చేసినట్లు సిరాజ్ చెప్పాడు. బ్రౌన్ మంకీ తరహాలో కనిపిస్తున్నట్లు తనను వాళ్లు కించపరిచారని, బ్రేక్ లేకుండా ప్రేక్షకులు తనపై దూషణలకు దిగారని తెలిపాడు. అయితే దాన్ని నేను సహించలేకపోయానని, అందుకే అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు అతను చెప్పుకొచ్చాడు. ఈ వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ఆటను బహిష్కరించడానికి అంపైర్లు అవకాశం ఇచ్చినా రహానే అలా చేయలేదని, ఆటను గౌరవిస్తూ కొనసాగుతామని స్పష్టం చేశాడని, ఆ వ్యాఖ్యలు తనను మానసికంగా ధృఢం చేశాయన్నాడు.

 పబ్లిసిటీ కోసం కాదు..

పబ్లిసిటీ కోసం కాదు..

ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంతి తగిలిన కామెరూన్ గ్రీన్‌కు సాయం చేసేందుకు వెళ్లిన సిరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సిరాజ్‌ను ప్రశ్నించగా.. అది ఆ సమయంలో అలా జరిగిపోయిందని, ఆ సంఘటనకు తనకు పబ్లిసిటీ తెస్తుందని ఏమాత్రం ఊహించలేదని సిరాజ్ తెలిపాడు. గ్రీన్‌కు హెల్ప్ చేయాలనే అలా చేశానన్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో అరంగేట్రం చేసిన సమయంలో తన తండ్రి గుర్తుకు వచ్చాడని, ఆయన ఆకాశం నుంచి తన దీవెనలు ఇస్తున్నట్లు భావించానని సిరాజ్ తెలిపాడు. తొలి రోజు బౌలింగ్ చేసేందుకు కొంత టెన్షన్‌కు గురయ్యానని, కానీ మెల్లమెల్లగా ఆ ఒత్తిడిని జయించినట్లు అతను చెప్పుకొచ్చాడు. లబుషేన్ వికెట్ తీసిన తర్వాత తన ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. మాజీ క్రికెటర్‌ రాహుల్ ద్రావిడ్, హైదరాబాద్ టీమ్ కోచ్ భరత్ అరుణ్ ఇచ్చిన సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నాడు.

Story first published: Thursday, January 21, 2021, 20:05 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X