న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాలాసార్లు చావాలనుకున్నా.. తెలుసుంటే సుశాంత్‌తో మాట్లాడేవాడిని : షమీ

Mohammed Shami Says My family ensured I was never alone during the time I felt suicidal

న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కుటుంబ సభ్యుల అండతో డిప్రెషన్ నుంచి బయటపడి జీవితంతో పోరాడుతున్నానని తెలిపాడు. ఇప్పటికే చాలా సందర్భాల్లో మానసికంగా తాను అనుభవించిన క్షోభను వెల్లడించిన ఈ స్టార్ పేసర్.. ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం నేపథ్యంలో మరోసారి తన కష్టాలను హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సుశాంత్ సింగ్ తనకు స్నేహితుడేనని చెప్పిన షమీ.. అతని మానసిక స్థితి తెలుసుంటే తన కష్టాలు చెప్పి ధైర్యం చెప్పేవాడినన్నాడు.

ఒంటరిగా వదిలేయలేదు..

ఒంటరిగా వదిలేయలేదు..

‘డిప్రెషన్‌ అనేది చాలా పెద్ద సమస్య. అందుకు తగిన కౌన్సిలింగ్‌ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు గొప్ప నటుడైన సుశాంత్ సింగ్ ప్రాణాలు తీసుకున్నాడు. అతను నాకు ఫ్రెండే. సుశాంత్ మానసిక స్థితి గురించి తెలుసుంటే అతనితో మాట్లాడేవాడిని. నేను పడ్డ కష్టాలను పడ్డ మానసిక క్షోభను వివరించేవాడిని. వాటి నుంచి ఎలా బయటపడ్డానో చెప్పేవాడిని. నా విషయానికి వస్తే ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలో నా కుటుంబం అండగా నిలబడింది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను ఒంటరిగా వదిలేయలేదు. అలా ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడి పోరాటం చేయాల్సిందే అనే భావనకు వచ్చా. నేను ఎప్పుడూ ఒంటరి కాదనే భరోసా నా కుటుంబ సభ్యులు నాకిచ్చారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ..

కెప్టెన్ విరాట్ కోహ్లీ..

అలానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సహచర ఆటగాళ్లు కూడా నాకు అండగా నిలిచారు. ఎవరైనా మానసిక సమస్యతో సతమతమైతే దాన్ని మీలోనే ఉంచుకోకండి. మన మంచిని కోరుకునే వాళ్లతో పంచుకోండి. సమాధానం దొరుకుతుంది. అంతేకానీ చావు ఒక్కటే మార్గం కాదు. నా విషయంలో జట్టు నుంచి వచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేనిది. నేను నిజంగా అదృష్టవంతుడ్నే' అని షమీ చెప్పుకొచ్చాడు.

ఊర్లోనే ఉన్నా..

ఊర్లోనే ఉన్నా..

ఇక ఈ మూడు నెలల లాక్‌డౌన్ సమయాన్ని తన సొంతూరులో గడిపానని షమీ చెప్పుకొచ్చాడు. తనకు ఓ చిన్న అకాడమీ కూడా ఉందని, అందులోనే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. ‘లాక్ డౌన్ టైమ్ మొత్తాన్ని ఊరిలోని గడిపా. నాకున్న చిన్న అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా. నా తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా పేస్ బౌలరే. బెంగాల్ అండర్- 23 జట్టుకు ఆడుతున్నాడు. నాతోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. టీమ్ ఫిజియో సూచనల మేరకు నా సొంతమైదానంలోనే సాధన చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో సొంతగ్రౌండ్ కలిగి ఉండటం అదృష్టంగా ఫీలవుతున్నా.'అని షమీ తెలిపాడు.

బౌలర్లకు కష్టమే..

బౌలర్లకు కష్టమే..

కరోనా నేపథ్యంలో ఉమ్మిపై విధించిన తాత్కలిక నిషేధంతో బౌలర్లకు ఇబ్బందులు తప్పవని షమీ తెలిపాడు. ఉమ్మి లేకుండా బంతిని రివర్స్ స్వింగ్ చేయడం కష్టమవుతుందని చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలువాటుపడాల్సిందేనని, అయితే బౌలర్లు అనుకూలంగా ఉండే పిచ్‌లు సిద్దం చేయాలని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సన్నాహకాలు చేపట్టలేదని, భవిష్యత్తు గురించి తానేమి పెద్దగా ఆలోచించన్నాడు. అప్పటి పిచ్‌లను బట్టి అక్కడే ప్రణాళికలు రచిస్తామని తెలిపాడు.

భారత్-పాక్ ఆటగాళ్లు కలిసి తినేవాళ్లు.. ఆరోజులే వేరు: సర్ఫరాజ్ అహ్మద్

Story first published: Friday, June 19, 2020, 16:06 [IST]
Other articles published on Jun 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X