భారత్-పాక్ ఆటగాళ్లు కలిసి తినేవాళ్లు.. ఆరోజులే వేరు: సర్ఫరాజ్ అహ్మద్

కరాచీ: భారత్, పాకిస్థాన్ మధ్య రాజీకీయంగా నెలకొన్న విబేధాల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య గత కొంతకాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. అయితే భారత్‌తో కలిసి మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు పాక్ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిన బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడంలేదు. ఉగ్రవాదాన్ని అరికట్టేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. అయితే దాయాదీల మధ్య మళ్లీ సిరీస్‌లు జరగాలని రెండు దేశాల ఆటగాళ్లు కోరుకుంటున్నారు.
పాక్ మాజీపేసర్ షోయబ్ అక్తర్, భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇప్పటికే బహిరంగంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇదే మాట అన్నాడు. త్వరలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆ రోజులే వేరు..
ద్వైపాక్షిక సిరీస్‌లో జరిగిన సమయంలో ఇరు దేశాల ఆటగాళ్లు చాలా స్నేహంగా ఉండేవారని, కలిసి తినేవాళ్లని సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్ల మధ్య ఉన్న చనువును తాను కళ్లారా చూశానని, ఆ రోజులే వేరన్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాక్ సాధించిన విజయానికి గురువారానికి(జూలై18) మూడేళ్లు కావడంతో ఈ సందర్భంగా క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘ఇరుదేశాల అభిమానులకు క్రికెట్‌పై ప్రేమ ఎక్కువ. క్రికెట్ అంటే పిచ్చి కూడా. ఇక ఇరుదేశాల ఆటగాళ్ల మధ్య ఉండే స్నేహాన్ని నేను నా కళ్లారా చూశా. 2007లో భారత పర్యటనకు వెళ్లినప్పుడు, 2008లో పాక్‌కు భారత్ వచ్చినప్పుడు ఆటగాళ్లు ఎంత చనువుగా, స్నేహంగా ఉండేవారో దగ్గరనుంచి చూశా. ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి తినేవాళ్లు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇరు దేశాలు మ్యాచ్‌లు ఆడేలేని పరిస్థితి నెలకొంది. త్వరలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి, ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని ఆశిస్తున్నా.'అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు.

దాయాదుల పోరు ఫీలింగే వేరు..
ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటేనే అభిమానులు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. అదే టోర్నీ అయినా.. మరే సిరీస్ అయినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ దేశమే గెలవాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటారని సర్ఫరాజ్ తెలిపాడు. ‘భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే పరిస్థితి మనందరికి తెలిసిందే. అదేలాంటి మ్యాచ్ అయినా ఇరు దేశాల అభిమానులు విజయాన్నే ఆశిస్తారు. ఓసారి దుబాయ్‌లో ధావన్ కలిసినప్పుడు మేమిద్దరం ఇదే మాట్లాడుకున్నాం. మేం భారత్‌పై గెలవాలనుకుంటే.. వారు మాపై విజయం సాధించాలనుకుంటారు. భారత్‌పై గెలవాలని పాక్ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకుంటారు. అది ఓ అద్భుతమైన అనుభూతి'అని ఈ పాక్ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.

జూన్ 18 మరిచిపోలేని రోజు..
ఇక జూన్ 18 తన జీవితంలోనే మరిచిపోలేని రోజని సర్ఫారాజ్ చెప్పుకొచ్చాడు. ప్రతీ పాకిస్థానీ సంతోషపడ్డాడని 2017 చాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఉద్దేశించి అన్నాడు. ‘చాలా రోజుల తర్వాత ఓ పెద్ద టోర్నీలో.. అత్యంత బలమైన భారత్ జట్టుపై పాకిస్థాన్ గెలిచింది. ఆ క్షణం నాతోపాటు ప్రతీ పాకిస్థానీ గుండె సంతోషంతో ఉప్పొంగింది. నాకు, చివరకు నా కుటుంబానికి జూన్ 18 మరవలేని మధురమైన రోజు.'అని తెలిపాడు.
అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ఇంట విషాదం

ధోనీ.. నా ఫేవరేట్
అప్పటి వరకు ఉన్న కీపర్ల థృక్పథాన్ని పూర్తిగా మార్చేసిన ఆటగాళ్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మహేంద్రసింగ్ ధోనీ. ఆస్ట్రేలియా జట్టుకి సుదీర్ఘకాలం ఆడిన గిల్‌క్రిస్ట్.. ఓపెనర్‌గా వికెట్ కీపర్‌గా టీమ్‌లో చెరగని ముద్ర వేశాడు. మరోవైపు ధోనీ కూడా కీపర్/ఫినిషర్/ కెప్టెన్‌గా మూడు ఐసీసీ టోర్నీలను భారత్‌కి అందించాడు. తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో కీపర్లు టాపార్డర్‌లో కూడా ఆడగాలరిన చాటి చెప్పాడు.అయితే ఈ ఇద్దరిలో బెస్ట్ ఎవరని సర్ఫరాజ్‌ను అడగ్గా.. క్షణం కూడా ఆలోచించని సర్ఫరాజ్.. ‘ధోనీ' అని సమాధానం ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
భారతీయులపై మండిపడిన పోర్న్ స్టార్‌గా మారిన మహిళా రేసర్!