Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖలో ధోనీ విధ్వంసాన్ని ఊహించలేదు.. అలాంటి ఇన్నింగ్స్ మళ్లీ చూడలేదు: కైఫ్

 Mohammad Kaif recalls MS Dhoni Vizag masterclass

న్యూఢిల్లీ: విశాఖ తీరానా.. దాయాదీ పాకిస్థాన్‌పై టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ సృష్టించిన విధ్వంసం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌తోనే జార్ఖండ్ డైనమైట్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఆ క్షణమే ధోనీ పేరు క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. అంతకుముందే భారత జట్టులోకి అరంగేట్రం చేసినా.. అంతగా ఆకట్టుకులేకపోయాడు. జుంపాల జట్టు ఆటగాడిగానే నిలిచిపోయాడు. కానీ 2005లో విశాఖ పట్నం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన ఉగ్రరూపాన్ని చూపించాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ సిక్సర్లు బాది హిట్టర్‌గా వెలుగులోకి వచ్చిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫస్ట్ మెరిసింది మాత్రం ఆమ్యాచ్‌లోనే.

 ఆకాశమే హద్దుగా..

ఆకాశమే హద్దుగా..

సౌరవ్ గంగూలీ నేతృత్వంలో బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని బరిలోకి దిగిన ధోనీ 123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 రన్స్‌తో వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో తాను కొట్టిన షాట్స్ మైదానం పైకప్పును తాకాయి. హెలికాప్టర్ షాట్ అనేది కూడా ఆ మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. ధోనీని అడ్డుకునేందుకు వరుసగా బౌలర్లని మార్చినా ప్రయోజనం లేకపోయింది. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసిన అఫ్రిదికి కూడా శిక్ష తప్పలేదు. ఎంతలా అంటే.. ఆ మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు. ధోనీ దెబ్బకి అఫ్రిది వేసిన 9 ఓవర్లలోనే 9.11 ఎకానమీతో 82 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆ మ్యాచ్‌‌‌లో భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఆ సెంచరీతో ధోనీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

అసలు ఊహించలేదు..

అసలు ఊహించలేదు..

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ గుర్తుచేసుకున్నాడు. ధోనీ నుంచి అంతటి విధ్వంసకర ఇన్నింగ్స్‌నే ఊహించలేదన్నాడు.

బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్‌లో రనౌట్‌గా.. అదీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు.

అప్పుడే అనుకున్నా...

అప్పుడే అనుకున్నా...

‘బంగ్లాదేశ్‌తో జరిగిన అరేంగట్ర్ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అవ్వడం చూసి అతనిలో మ్యాచ్ ఫినిషింగ్, గెలిపించే సామర్థ్యాలు ఉన్నాయని ఎవరం అనుకులేదు. అతని తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా అంతగా రాణించలేదు. కానీ పాకిస్థాన్‌పై విశాఖ తీరాన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ను నేను చాలా దగ్గరగా చూశాను. అప్పుడే అతను సుదీర్ఘకాలం టీమిండియా తరఫున ఆడుతాడని అర్థమైంది. కెరీర్‌ ఆరంభంలోనే ఓ బ్యాట్స్‌మెన్ నుంచి అలాంటి విధ్వంసక ఇన్నింగ్స్‌ నమ్మశక్యంకానిదే. ధోనీ ధాటికి పాక్ బౌలింగ్ కకావికలమైంది. ముఖ్యంగా.. అతను బంతిని బాదిన తీరు అమోఘం. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ ఆ తరహాలో హిట్టింగ్ చేయడం నేను చూడలేదు. ఆ మ్యాచ్‌లో ధోనీని మూడో స్థానంలో పంపించడం తెలివైన నిర్ణయం'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

సచిన్ vs కోహ్లీ.. వన్డేల్లో ఎవరు గొప్పో చెప్పిన గంభీర్

 ఇప్పటికీ ధోనీనే నెంబర్ వన్

ఇప్పటికీ ధోనీనే నెంబర్ వన్

ఫిట్‌నెస్ విషయంలో ధోనీకి తిరుగులేదని, ఇప్పటికీ అతనే నంబర్ వన్ వికెట్ కీపరని కైఫ్ కొనియాడాడు. ఉన్న పళంగా ధోనీని టీమ్ నుంచి తప్పించాల్సిన పనిలేదన్న ఈ మాజీ క్రికెటర్.. కేఎల్ రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్‌గానే పరిగణించాలని సూచించాడు. ‘ధోనీ కొంచె గ్యాప్ తీసుకోవడంతో ఐపీఎల్ ఆడితే రీ ఎంట్రీ సులువవుతుందని అంతా అనుకున్నారు. కానీ నా దృష్టిలో అది సరైనా ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ చాలా పెద్ద ప్లేయర్. తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆరు, ఏడు స్థానాల్లో ఒత్తిడిలో ఎలా ఆడాలో ధోనీ కంటే ఎవరికి బాగా తెలియదు. ధోనీని ఎవరూ భర్తీ చేయలేరు'అని తెలిపాడు.

Story first published: Friday, May 22, 2020, 11:50 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+