న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులపై దాడులు దారుణం: మిథాలీ రాజ్

Mithali Raj Urges To People Our Front Line Warriors Need All Our Support

హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దాన్ని అరికట్టేందుకు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా పోరాడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధనలను కఠినంగా పాటిస్తూ.. కరోనాను తరిమికట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కానీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు విచక్షణ లేకుండా ఈ కరోనా పోరాట యోధులపైనే దాడులకు పాల్పడుతున్నారు.

హీరో విష్ణు చాలెంజ్

ఇప్పటికే ప్రభుత్వం కరోనా యోధులపై దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నా.. దాడులు మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే ఈ దాడులు చేస్తున్న వారిలో అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు వీడియోలు ద్వారా సందేశం ఇస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ హీరో మంచు విష్ణు పోలీసులు, డాక్టర్స్, పారిశుధ్య ఫ్రంట్ లైన్ కార్మికులను మనం ఎంతో గౌరవించుకోవాలని ట్వీట్ చేశారు. అంతేకాక.. ఈ సందేశాన్ని అందరికీ చేరేలా చేయాలని అతను బాలీవుడ్ నటి రవీనా టండన్, టీమిండియా మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, నటుడు సునీల్ శెట్టిలను నామినేట్ చేశాడు.

ఆ వార్తలు బాధ కలిగించాయి..

ఆ వార్తలు బాధ కలిగించాయి..

దీంతో మిథాలీ స్పందించింది. ఓ మంచి సందేశం అందించేందుకు తనను నామినేట్ చేసిన విష్ణుకి ధన్యవాదాలు తెలిపింది. ‘ఈ ప్రాణాంతక వైరస్ మనందరి జీవితాల్లో నిలకడ లేకుండా చేసింది. ఈ వైరస్‌పై పోరాటం చేయాలంటే.. అందరు ఐకమత్యంగా కృషి చేయాలి. కానీ, కొన్ని చోట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు విని చాలా బాధకలిగింది.

వాళ్ల జీవితాలను పనంగా పెట్టి..

వాళ్ల జీవితాలను పనంగా పెట్టి..

వాళ్లందరు ముందుడి శక్తివంచన లేకుండా వాళ్ల జీవితాలను పనంగా పెట్టి.. మన కోసం పోరాటం చేస్తున్నారు. ఇటువంటి దాడులు చేయడం వాళ్ల ఆత్మస్థైర్మాన్ని దెబ్బతీస్తుంది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మనందరిని కాపాడేందుకు వాళ్లు పడుతున్న శ్రమను అభినందించండి. వారికి మర్యాద, గౌరవం, మద్ధతు ఇవ్వండి'అంటూ మిథాలీ వీడియో ట్వీట్‌లో కోరింది. అంతేకాక.. ఇందుకు మద్దతు ఇవ్వాల్సిందిగా లియాండర్ పేస్, సైనా నెహ్వాల్, రవిచంద్రన్ అశ్విన్‌లను మిథాలీ నామినేట్ చేసింది.

Story first published: Wednesday, April 29, 2020, 21:47 [IST]
Other articles published on Apr 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X