న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆలస్యం వద్దు.. వచ్చే ఏడాదే మహిళల ఐపీఎల్ నిర్వహించాలి: మిథాలీ రాజ్

Mithali Raj Says Cant wait forever, BCCI should start womens IPL by 2021

హైదరాబాద్: మహిళల ఐపీఎల్‌ ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) మరింత కాలం ఎదురు చూడవద్దని టీమిండియా మహిళ వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. పురుషులంత కాకపోయినా సాధారణంగానైనా వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించాలని కోరింది.

పురుషులంత కాకపోయినా..

పురుషులంత కాకపోయినా..

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ. ‘పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ప్రారంభించాలి. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే కొన్ని నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలి. నలుగురు విదేశీ క్రికెటర్లు కాకుండా తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరుగురితో ఆడించాలి' అని మిథాలీ సూచించింది.

ఆ విషయం తెలుసు..

ఆ విషయం తెలుసు..

పూర్తిస్థాయి ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేకపోయినా ప్రస్తుత ఫ్రాంఛైజీలు జట్లను తీసుకుంటే ఆ సమస్యను అధిగమించొచ్చని ఈ హైదరాబాద్ స్టార్ అభిప్రాయపడింది. 'దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరనే విషయం నాకు తెలుసు. అయితే, ఇప్పుడున్న ఫ్రాంఛైజీలు ఐదు లేదా ఆరు కొత్త జట్లను తయారు చేస్తే సరిపోతుంది. ఎలాగూ బీసీసీఐ వద్ద నాలుగు జట్లున్నాయి. ఈ విషయంపై కాలయాపన చేయవద్దు. ఏదో ఒక సందర్భంలో ముందడుగు వేయాలి. ఏటా కొనసాగిస్తూ మెల్లమెల్లిగా నలుగురు విదేశీయుల సూత్రాన్ని అవలంబించాలి' అని వివరించింది.

షెఫాలీని వన్డేల్లో కూడా..

షెఫాలీని వన్డేల్లో కూడా..

అలాగే, టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన యువ సంచలన బ్యాటర్‌ షెఫాలీవర్మను వన్డే జట్టుకు ఎంపికచేయాలని మిథాలీ సూచిచింది. ప్రతిభకు వయసు అడ్డంకి కాకూడదని అభిప్రాయపడింది. ఇక యువ సంచలనం షెఫాలీ వర్మ ఫైనల్ మినహా టీ20 ప్రపంచకప్‌ ఆద్యాంత అదరగొట్టిన విషయం తెలిసిందే. లీగ్ దశలో జైత్రయాత్ర కొనసాగించిన హర్మన్ ప్రీత్ సేన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకున్నారు.

Story first published: Thursday, March 26, 2020, 19:32 [IST]
Other articles published on Mar 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X