న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతోమంది అమ్మాయిలకు మిథాలీ రాజ్ స్ఫూర్తి: పుజారా

Mithali Raj retirement: You are an inspiration for tons of girls says Cheteshwar Pujara

హైదరాబాద్: దేశంలోని ఎంతోమంది అమ్మాయిలకు భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్ఫూర్తి అని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ ఛతేశ్వర పుజారా అన్నారు. మిథాలీ రాజ్ మంగళవారం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది క్రికెటర్లు మిథాలీకి అభినందనలు తెలుపుతున్నారు.

యూఎస్‌ ఓపెన్‌.. రోజర్ ఫెదరర్‌కు షాక్!!యూఎస్‌ ఓపెన్‌.. రోజర్ ఫెదరర్‌కు షాక్!!

ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి:

తాజాగా మిథాలీని ఉద్దేశిస్తూ ఛతేశ్వర పుజారా కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసాడు. 'గొప్ప అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ఉన్న మిథాలీకి అభినందనలు. దేశంలోని ఎంతోమంది అమ్మాయిలకు నువ్వు స్ఫూర్తి' అని పుజారా రాసుకొచ్చాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా రిటైర్మెంట్‌పై ట్వీట్ చేసాడు. 'మిథాలీ అంతర్జాతీయ టీ20లో అద్భుత ప్రదర్శన చేసావు. మార్గదర్శకులలో నువ్వు ఒకరు. 2021 ప్రపంచకప్‌లో నీ ఆట కోసం ఎదురుచూస్తున్నా' అని ట్వీట్ చేసాడు.

అత్యధిక పరుగులు:

అత్యధిక పరుగులు:

భారత టీ20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ.. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మూడు టీ20 ప్రపంచకప్‌ (2012, 14, 16)లకు కెప్టెన్‌గా ఉన్నారు. 2,364 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ నిలిచారు. టీ20లలో 17 హాఫ్‌ సెంచరీలు చేశారు. అత్యధిక స్కోరు 97 నాటౌట్‌. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచే మిథాలీకి చివరిది. ఆ మ్యాచ్‌లో మిథాలీ 32 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశారు.

వెస్టిండీస్ సిరీస్‌లో కోచ్ రవిశాస్త్రి సూచనలు పని చేశాయి: విహారి

2021 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి:

2021 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి:

మిథాలీ 203 వన్డేలలో 6,720 పరుగులు.. 10 టెస్టుల్లో 663 పరుగులు చేశారు. '2006 నుంచి టీ20లు ఆడుతున్నాను. 2021 వన్డే ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపైనే దృష్టి సారించా. అందుకే టీ20ల నుండి రిటైర్ అవుతున్నా. భారత్‌కు ప్రపంచకప్‌ను అందించడమే నా కల' అని బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Story first published: Wednesday, September 4, 2019, 12:29 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X