న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ లాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు అవసరం.. అతడు ఉంటే మ్యాచ్‌ మరోలా ఉండేది'

Michael Holding says Team India needs a player like MS Dhoni
Ind vs Aus 2020 : Team India Needs A Player Like MS Dhoni - Michael Holding

సిడ్నీ: టీమిండియాకు ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని వెస్టిండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు‌. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ భారీ ఛేదనలో ధోనీ నైపుణ్యం, అతడి పాత్రను టీమిండియా ఎంతో మిస్‌ అవుతుందని‌ అభిప్రాయపడ్డాడు. ఇండియ‌న్ టీమ్‌లో చాలా మంచి ప్లేయ‌ర్స్ ఉన్నారని, అయితే ధోనీ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని హోల్డింగ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేలో 375 ప‌రుగుల‌ను ఛేదించ‌లేక 66 ప‌రుగుల‌తో ఓడిన నేప‌థ్యంలో హోల్డింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

ధోనీ లాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు అవసరం

ధోనీ లాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు అవసరం

తాజాగా యూట్యూబ్‌ షోలో తొలి వన్డే మ్యాచ్‌పై మైకేల్ హోల్డింగ్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు. 'భారీ స్కోరు ఛేదన అంటే భారత్‌కు క్లిష్టమే. జట్టులో ఎంఎస్ ధోనీ లేకపోవడం టీమిండియాకు కష్టంగా మారింది. సగం మంది పెవిలియన్‌కు చేరిన అనంతరం మహీ క్రీజులోకి వచ్చినా ఛేదనను నియంత్రణలోకి తీసుకొస్తాడు. గతంలో ధోనీ జట్టులో ఉన్నప్పుడు భారత్ గొప్ప విజయాలు సాధించింది. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉంది. కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన స్ట్రోక్‌ప్లే కలిగి ఉన్నారు. హార్దిక్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ కోహ్లీ సేనకు ధోనీ వంటి ప్లేయర్‌ అవసరం. మహీ నైపుణ్యమే కాదు, జట్టులో అతడి పాత్రా ఎంతో కీలకం' అని హోల్డింగ్ అన్నాడు.

లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్‌ మ్యాన్

లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్‌ మ్యాన్

'అంతేగాక ఎంఎస్ ధోనీ జట్టులో ఉంటే టాస్‌ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ధోనీ సామర్థ్యం అందరికీ తెలుసు. ఛేదనలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కంగారు పడటం మనం ఎన్నడూ చూడలేదు. లక్ష్యాన్ని ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. తనతో పాటు క్రీజులో ఉండే ఆటగాడికి అతడు సలహాలు ఇస్తూ సాయం చేస్తుంటాడు. కాగా భారత్‌కు ప్రస్తుతం గొప్ప బ్యాటింగ్ దళం ఉన్నా లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్‌ మ్యాన్‌' అని మైకేల్ హోల్డింగ్ చెప్పాడు.

పేలవ ఫీల్డింగ్‌

పేలవ ఫీల్డింగ్‌

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవ ఫీల్డింగ్‌ చేసిందని, ఎన్నో అవకాశాలు చేజార్చుకుందని వెస్టిండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ క్యాచ్‌లు జారవిడవడంతో పాటు రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 249, వన్డేల్లో 142 వికెట్లు పడగొట్టాడు.

ISL 2020: హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌ 'డ్రా'!!

Story first published: Sunday, November 29, 2020, 7:55 [IST]
Other articles published on Nov 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X