న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: నటరాజన్ ఔట్.. హైదరాబాద్ జట్టులో నాలుగు మార్పులు.. ముంబైదే బ్యాటింగ్!

Mumbai Indians opt to bat, Sunrisers Hydearabad make 4 changes

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. చేజింగ్‌లో తడబడుతున్న సన్‌రైజర్స్‌ను మరోసారి లక్ష్యచేధనలో దెబ్బకొట్టాలని భావించిన ముంబై సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్‌వైపే మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో ప్రతీ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. రోహిత్ ఒక్కడే భిన్నంగా బ్యాటింగ్‌ తీసుకున్నాడు. అయితే పిచ్ స్వభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని, తొలి బంతి పడేవరకు ఏమిచెప్పలేమని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని మార్కో జాన్సన్ స్థానంలో ఆడామ్ మిల్నే జట్టులోకి వచ్చాన్నాడు.

ఇక హైదరాబాద్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఎవరెవరు జట్టులోకి వచ్చారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తనకు గుర్తు లేదని టీమ్ షీట్‌లో చూడాలని పేర్కొన్నాడు. అయితే వృద్దిమాన్ సాహా, జాసన్ హోల్డర్, టీ నటరాజన్‌, షాబాజ్ నదీమ్ స్థానాల్లో విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు.

నటరాజన్‌ను తప్పించి ఖలీల్ అహ్మద్‌ను తీసుకురావడం.. జట్టుకు భారంగా మారిన విజయ్ శంకర్‌ను జట్టులోనే కొనసాగించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో మాత్రం అర్థం కావడంలేదు.

ఈ సీజన్‌లో ఇప్పటికే వరుసగా రెండు ఓటములతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు కేకేఆర్‌తో ఓటమి అంచున పుంజుకొని థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన ముంబై రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దాంతో ఈ మ్యాచ్‌ ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా... చెరో ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించాయి. తటస్థ వేదికపై మాత్రం సన్‌రైజర్స్‌దే పై చేయి. తటస్థ వేదికల్లో నాలుగు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా.. మూడింట్లో హైదరాబాద్‌ విజయం సాధించింది.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడామ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

Story first published: Saturday, April 17, 2021, 19:26 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X