'ఒక్కరి లోటుతో జట్టు బలం కోల్పోదు, ఈ సారి ఐపీఎల్ ట్రోపీ మాదే'

Posted By:
Laxman hopes for better finishing acts

హైదరాబాద్: ఇంకో రెండ్రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్‌ను పురస్కరించుకుని గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులందరిని మీడియాకు పరిచయం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, సీఈవో షణ్ముకం సమక్షంలో జట్టులో చేరిన కొత్త ఆటగాళ్లకు జెర్సీలు అందజేశారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

వార్నర్ లేడు అంతే, జట్టు బలం తగ్గలేదు:

వార్నర్ లేడు అంతే, జట్టు బలం తగ్గలేదు:

‘జట్టులో ఏ ఒక్కరో ముఖ్యం కాదు. సమష్టి కృషితోనే ఏదైనా సాధ్యం. 2016లోలా మళ్లీ ట్రోఫీ గెలవాలంటే సమష్టిగా రాణించాలి. క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట. ఏ ఒక్క ఆటగాడిపై అతిగా ఆధారపడలేం. గత సీజన్‌లలో వార్నర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. అనివార్య కారణాల వల్ల అతను జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ప్రభావం జట్టుపై కొద్దిగా ఉంటుంది.

ఇంకా, మాది అత్యుత్తమ జట్టే:

ఇంకా, మాది అత్యుత్తమ జట్టే:

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ఆటగాళ్ళున్నారు. అవకాశం లభిస్తే సత్తాచాటేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. వేలం పాటలో సమర్థులైన ఆటగాళ్లను తీసుకున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకం ఉంది. అలెక్స్‌ హేల్స్‌ నాణ్యమైన కుడిచేతి వాటం ఆటగాడు. ఎడమచేతి వాటం ధావన్‌కు అతనే సరైన జోడీ. కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ రాణిస్తాడన్న నమ్మకముంది'' అని తెలిపాడు.

 కొత్తగా చేరిన ఆటగాళ్లు:

కొత్తగా చేరిన ఆటగాళ్లు:

నటరాజన్, గోస్వామి, సాహా, ఖలీల్ అహ్మద్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, థంపీ, సచిన్ బేబీ, సందీప్, మెహదీ హసన్, స్టాన్‌లేక్, బ్రాత్‌వైట్, షకీబ్ ఈసారి కొత్తగా జట్టులో చేరారు. మరోవైపు జట్టు వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరిస్తాడని మెంటార్ లక్ష్మణ్ తెలిపాడు. గతంలో మా జట్టు అంతా బాగున్నప్పటికీ మిడిలార్డర్ కూర్పు సరిగా లేదు. ఈసారి ఆ లోటును భర్తీ చేసేందుకే ఐపీఎల్ వేలంలో నాణ్యమైన కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లే అని వీవీఎస్ వెల్లడించాడు.

 ట్రోఫీ కోసం శాయశక్తులా పోరాడతాం: లక్ష్మణ్‌

ట్రోఫీ కోసం శాయశక్తులా పోరాడతాం: లక్ష్మణ్‌

గత 2 సీజన్‌లలో మిడిలార్డర్‌ ప్రదర్శనపై జట్టు మేనేజ్‌మెంట్‌ సంతృప్తిగా లేదు. ఐతే వేలం పాటలో యూసుఫ్‌ పఠాన్‌, మనీష్‌ పాండే లాంటి నాణ్యమైన ఆటగాళ్లను తీసుకున్నాం. మంచి అనుభవం.. పరిస్థితులకు తగ్గట్లు రాణించే సత్తా వారి సొంతం. పఠాన్‌, పాండేల చేరికతో మిడిలార్డర్‌ పటిష్టంగా తయారైంది. ఐపీఎల్‌లో నాణ్యమైన ఆటగాళ్లతో ప్రతి జట్టు పటిష్టంగా ఉంది. తొలి 2 మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌ల్లో విజయాలతో ఐపీఎల్‌లో బోణీ చేస్తాం. అభిమానుల మద్దతు మాకెప్పుడూ ఉంటుంది.

బౌలింగ్ కోచ్ మురళీధరన్‌ మాట్లాడుతూ:

బౌలింగ్ కోచ్ మురళీధరన్‌ మాట్లాడుతూ:

షకీబుల్‌ హసన్‌ జట్టులోకి రావడంతో ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగే వెసులుబాటు లభించింది. పవర్‌ ప్లే, డెత్‌ ఓవర్లలో షకీబ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. రషీద్‌ఖాన్‌ స్ట్రైక్‌ బౌలర్‌. పవర్‌ ప్లే, డెత్‌ ఓవర్లలో షకీబ్‌, రషీద్‌లను సమర్థంగా ప్రయోగిస్తాం. వికెట్లు తీయడం అన్నిటికంటే ముఖ్యం. ప్రతి మ్యాచ్‌లో పిచ్‌ది కీలకపాత్రే. రానున్న సీజన్‌లో ఎలాంటి సవాల్‌కైనా మేం సిద్ధం

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 12:18 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి