న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓరేయ్ కృనాల్ పాండ్యా.. ద్రవిడ్, ధావన్, శాంసన్ కెరీర్‌లను నాశనం చేశావ్ కదరా! ఫ్యాన్స్ ఫైర్!

Krunal Pandya Brutal Trolls: Indian Fans And Sri Lankan Fans Roasted The Indian All Rounder
Ind vs SL 2021 : Fans Troll Krunal Pandya After India’s Defeat In T20I Series | Oneindia Telugu

హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో వరుసగా 8 సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు శ్రీలంక షాకిచ్చింది. గురువారం జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో వానిందు హసరంగ (4/9) చెలరేగడంతో శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంకకు ఐదు వరుస టీ20 సిరీస్‌ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్‌ విజయం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే మొదటిసారి.

అయితే ఈ ఘోర పరాజయానికి ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యానే కారణమని సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికి కరోనా సోకడంతోనే జట్టులో ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు దూరం కావాల్సి వచ్చిందని, దాంతో బలహీనమైన శ్రీలంక చేతిలో తలవొంచాల్సిందని మండిపడుతున్నారు.

మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కృనాల్..

బయోబబుల్‌లో కృనాల్ పాండ్యా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా సోకిందని, అతను ఇతర ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండటంతో వారు కూడా దూరం కావాల్సి వచ్చిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, మనీశ్ పాండే, యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు.

దాంతో టీమిండియా నెట్ బౌలర్లను తీసుకొని ఆడాల్సి వచ్చింది. అంతేకాకుండా బ్యాటింగ్ బలహీనమైంది. ఈ బలహీనతపైనే దెబ్బకొట్టిన శ్రీలంక చిరస్మరణీ విజయాన్నందుకుంది. దాంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కృనాల్‌కు ఇవ్వాలని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

లెజెండ్స్ ఇలానే ఉంటారు..

చిన్నపిల్లలు ప్రత్యర్థి టీమ్‌ను గెలిపిస్తారని, కానీ లెజెండ్స్ మాత్రం సిరీస్ విజయానందిస్తారని కృనాల్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శ్రీలంక అభిమానుల మనసుల్లో కృనాల్ చోటు సంపాదించుకున్నాడని, అతన్ని వారు దేవుడిగా కొలుస్తున్నారని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కృనాల్‌కు శ్రీలంక అభిమానులు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారని ట్వీట్ చేస్తున్నారు. ఇక దిగ్గజ రాహుల్ ద్రవిడ్ పరువు తీసాడని, అతని పేరు ప్రతిష్టలను నాశనం చేశాడని మండిపడుతున్నారు. అంతేకాకుండా కృనాల్‌ను రాళ్లతో కొట్టేందుకు ద్రవిడ్ సిద్దమయ్యాడనే ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఒంటి చేత్తో నాశనం చేశావ్ కదరా..

కృనాల్ ఒంటి చేత్తో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, ప్లేయర్స్‌గా శిఖర్ ధావన్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రాణాల కెరీర్‌లు నాశనం చేశాడని కామెంట్ చేస్తున్నారు. కృనాల్‌కే కరోనా రాకుంటే రెగ్యులర్ టీమ్ ఆడేదని సులువుగా సిరీస్ గెలిచేదంటున్నారు. అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు ఆడేవారని ట్వీట్ చేస్తున్నారు. కృనాల్ ఒక్కడి వల్లే భారత్ సిరీస్ కోల్పోవడమే కాకుండా ఆటగాళ్ల కెరీర్‌లు కూడా నాశనమయ్యాయంటున్నారు. అయితే కృనాల్ వల్ల మంచే జరిగిందని, టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఓ క్లారిటీ వచ్చిందంటున్నారు. శిఖర్ ధావన్, సంజూ శాంసన్‌లను తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిసిందంటున్నారు.

మూడో అత్యల్ప స్కోర్..

తొలుత భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. టీ20ల్లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (28 బంతుల్లో 23 నాటౌట్‌), భువనేశ్వర్‌ (32 బంతుల్లో 16) పోరాడటంతో భారత్‌ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

బౌలింగ్‌లో హసరంగకు కెప్టెన్‌ దసున్‌ షనక (2/20) కూడా తోడవ్వడంతో భారత్‌ కోలుకోలేదు. స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్‌; 1 ఫోర్‌) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులను అందుకున్నాడు.

Story first published: Friday, July 30, 2021, 13:49 [IST]
Other articles published on Jul 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X