న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kolkata Knight Riders మూడో టైటిల్ ముద్దాడేనా? జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!

Kolkata Knight Riders: Strength, Weakness, Playoffs Chances and Prediction

హైదరాబాద్: కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌.. ఐపీఎల్‌‌‌లోనే బలమైన జట్టు. ప్రతి సీజన్‌‌లో ప్లే ఆఫ్స్‌‌కు వెళ్లే వాటిల్లో కచ్చితంగా ఉండే టీమ్‌‌. 2012, 14 సీజన్లలో చాంపియన్‌‌గా నిలిచిన జట్టు. కానీ గత సీజన్‌‌లో ఐదో స్థానానికే పరిమితమైన కేకేఆర్.. ఈసారి భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నది. ముచ్చటగా మూడో టైటిల్‌‌ను ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌తో ఐపీఎల్‌‌ను ఎక్కడికో తీసుకెళ్లిన బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌గా తన పనితనాన్ని చూపెట్టబోతున్నాడు. ఇప్పటికే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీకే చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెకల్లమ్.. ఐపీఎల్ టైటిల్ కూడా అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.

వేలంలో కొత్త ప్లేయర్లను తీసుకొని దాదాపుగా సమస్యలన్నిటిని పరిష్కరించుకున్న కేకేఆర్‌‌.. ఇయాన్‌‌ మోర్గాన్‌‌, కమిన్స్‌‌ (రూ. 15.5 కోట్లు) కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. 23న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో తొలి పోరు మొదలుపెట్టనుంది. అభిమానుల అంచనాలను అందుకుంటూ మూడో టైటిల్ ముద్దాడుతుందా? జట్టు బలగం, బలహీనతలపై ఓ లుక్కెద్దాం.

బలం, బలగం..

బలం, బలగం..

ఈసారి కేకేఆర్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ యంగ్‌‌ అండ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో బలంగా కనిపిస్తున్నది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, ఆండ్రీ రస్సెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్‌‌ ఉంది. రసెల్‌‌ ఈసారి కూడా ట్రంప్‌‌ కార్డు. రస్సెల్‌‌ను ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపైనే కోల్‌‌కతా విజయవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌‌లో సునీల్ నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగలరు. ప్యాట్ కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది. చివరి నిమిషంలో టీమ్‌‌లోకి వచ్చిన అమెరికన్‌‌ పేసర్‌‌ అలీ ఖాన్‌‌ సంచలనాలు సృష్టిస్తాడా? చూడాలి.

బలహీనత..

బలహీనత..

కొంత మంది ప్లేయర్లను వదులుకొని కొత్త వారిని తీసుకోవడం వల్ల ప్రధాన లోపాలన్నింటినీ కేకేఆర్ సరి చేసుకుంది. ఏ టైమ్‌‌లోనైనా అద్భుతమైన ఫైనల్‌‌ ఎలెవన్‌‌ను బరిలోకి దించేలా ప్లేయర్లను అందుబాటులో ఉంచుకుంది. కాకపోతే బ్యాకప్‌‌ ప్లేయర్ల విషయంలోనే కొద్దిగా లోటు కనిపిస్తున్నది. టాప్‌‌ ప్లేయర్లు గాయపడితే వారి ప్లేస్‌‌ను భర్తీ చేసే వారు లేకపోవడం పెద్ద బలహీనత. రాణా, కార్తీక్‌‌లో ఒకరు గాయపడితే ఆ స్థాయిలో ఆడే బ్యాకప్‌‌ ప్లేయర్‌‌ లేడు. రింకూ సింగ్‌‌, రాహుల్‌‌ త్రిపాఠి, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, నిఖిల్‌‌ ఉన్నా.. వాళ్లకు అనుభవం‌ లేదు. లాస్ట్‌‌ సీజన్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌గా సేవలందించిన రస్సెల్‌‌.. ఈసారి బౌలింగ్‌‌ చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ రస్సెల్‌‌ గాయపడినా జట్టు సమతుల్యం దెబ్బతింటుంది.

అంచనా..

అంచనా..

టీ20లకు సరిపోయే పవర్‌‌ హిట్టర్లతో పాటు ట్రెడిషనల్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌తో కేకేఆర్‌‌ బలంగా ఉంది. బౌలర్లు కూడా అంచనాలు అందుకుంటే ప్లే ఆఫ్స్‌ చేరడం‌ ఖాయం. ఇప్పటికే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కేకేఆర్ సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. కెప్టెన్సీ విషయం దినేశ్ కార్తీక్‌కు తోడుగా ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో మోర్గాన్ కార్తీక్‌కు అండగా నిలవనున్నాడు.

జట్టు

జట్టు

బ్యాట్స్‌‌మెన్‌‌: ఇయాన్‌‌ మోర్గాన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి, రింకూ సింగ్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, టామ్‌‌ బాంటన్‌‌,

వికెట్‌‌ కీపర్లు: దినేశ్‌‌ కార్తీక్‌‌ (కెప్టెన్‌‌), నిఖిల్‌‌ నాయక్‌‌.

ఆల్‌‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్‌‌, కమలేష్ నాగర్‌‌కోటి, సునీల్‌‌ నరైన్‌‌, శివమ్‌‌ మావి.

బౌలర్లు: కుల్దీప్‌‌ యాదవ్‌‌, ఫెర్గుసన్‌‌, మణి మారన్‌‌, సిద్ధార్థ్‌‌, కమిన్స్‌‌, ప్రసిద్‌‌ కృష్ణ, సందీప్‌‌ వారియర్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి, అలీ ఖాన్‌‌.

Story first published: Wednesday, September 16, 2020, 20:40 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X