న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీరులారా మీకు పరిపరి దండాలు.. కార్గిల్ అమర జవాన్లకు భారత క్రికెటర్ల నివాళులు

Kargil Vijay Diwas: Sachin Tendulkar, Virat Kohli Lead Indian Cricketers Paying Tributes to Soldiers

న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకొని ఆ యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్లకు భారత క్రికెటర్లు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా త్రివిధ దళాల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. 1999లో మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ దుష్టపన్నాగానికి తెరతీయగా.. దీనికి భారత్ సైనికులు సింహాల్లా వారిపై లంఘించి దాయాదిని తరిమి తరిమి కొట్టారు.

ఈ యుద్ధంలో అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకొంటున్నాం. నేటితో భారత ఆర్మీ కార్గిల్ యుద్ద విజయానికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ లోకం అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంది. సలాం అంటూ వారి పాదాలకు పరిపరి దండాలు పెట్టింది.

స్పూర్తిదాయకం..

‘కార్గిల్‌ యుద్ధంలో మన భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మనమెప్పుడూ రుణపడి ఉంటాం. - సచిన్‌ టెండూల్కర్‌

‘మనల్ని రక్షించిన అమర జవాన్లకు నివాళులు. అలాగే ఇప్పుడు కాపాడుతున్న సైనికులకు వందనం. మీరు ఉండటం వల్లే మేం ప్రశాంతంగా ఉన్నాం.'- వీరేందర్‌ సెహ్వాగ్‌

‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా నాటి యుద్ధంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నా. వారి త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. -యువరాజ్‌ సింగ్‌

మీ వల్లే ఉన్నాం..

‘రాత్రింబవళ్లు అహర్నీషులు..మనల్ని కాపాడే భారత జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్‌. మీరు ఉండటం వల్లే మేం ఉన్నాం.' -మహ్మద్‌ కైఫ్‌

‘నిజమైన హీరోలకు తమ జెర్సీల వెనుక పేర్లుండవు. అలాంటి వారు తమ దేశ పతాకాన్ని ధరిస్తారు.- గౌతం గంభీర్‌

‘భారత రక్షణ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నా. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన వీరులకు వందనం. -విరాట్‌ కోహ్లీ

మీ త్యాగం అమరం..

మీ త్యాగం అమరం..

‘మనం జీవిస్తున్న ఈ రోజు కోసం వాళ్ల భవిష్యత్‌ను త్యాగం చేసిన అమరవీరులకు వందనం. -రిషభ్‌పంత్‌

‘మన దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హీరోలను ఎప్పటికీ మరవకూడదు. భారత సైన్యం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. జై హింద్‌ -అజింక్య రహానే

73 రోజులు.. 527 మంది మరణం..

73 రోజులు.. 527 మంది మరణం..

కార్గిల్‌లో 1999 మే-జూలై నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఆర్మీ చీఫ్ ముషారఫ్‌ భారత్‌తో యుద్ధానికి దిగాడు. ఎత్తయిన మంచు కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత ఆర్మీపైకి దాడి ప్రారంభించారు. శత్రువులు ఎత్తులో ఉండటం వారికి అనుకూలంగా మారింది. దిగువన ఉండటం ప్రతికూలంగా మారడంతో.. భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాడారు.

యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాక్.. జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరగా.. వెంటనే వెనుదిరిగాలను నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హెచ్చరించాడు.

దీంతో వెనుదిరిగిన భారత సైన్యం మిగతా ఔట్ పోస్టుల్లోని పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. జులై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. సుమారు 73 రోజలపాటు సాగిన యుద్ధం అధికారిక లెక్కల ప్రకారం 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

Story first published: Sunday, July 26, 2020, 15:39 [IST]
Other articles published on Jul 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X