For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను మెగా అభిమానిని: తిలక్ వర్మ

మెగా చిరంజీవికి తాను డైహార్డ్ ఫ్యాన్ అని టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ తెలిపాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే తనకు ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2025 విజయానంతరం తన అభిమాన హీరోను తిలక్ వర్మ కలుసుకున్న సంగతి తెలిసిందే.

గతేడాది అక్టోబర్‌లో 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమా సెట్‌కు వెళ్లి తన అభిమాన హీరోను తిలక్ కలిసాడు. ఆ సమయంలో తిలక్ వర్మను చిరంజీవి శాలువాతో సన్మానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తిలక్ వర్మ..'చిన్నప్పటి నుంచి నా ఏకైక హీరో చిరంజీవి గారు. ఆయనను కలవడం నా కల. ఆయన వినయం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. సంక్రాంతికి విడుదలైన 'మన శంకరవర ప్రసాద్ గారు'సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

IPL 2026 Tilak Varma Names Megastar Chiranjeevi as His All-Time Favorite Hero in Pre-Season Chit-Chat
Photo Credit: screen grab for JioHotstar

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. మెగాపవర్ స్టార్‌ను కలిసాడు. అక్కడ సినిమాలోని కొన్ని స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను చూసిన తిలక్, అవి చాలా సహజంగా, అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. 'ఒక క్రికెటర్ కావడంతో ఈ సినిమాలోని స్పోర్ట్స్ ఎమోషన్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి'అని తెలిపాడు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్‌లో ఉపయోగించిన ఓ పాత క్రికెట్ బ్యాట్‌ను గుర్తుగా ఇస్తూ.. దానిపై తన ఆటోగ్రాఫ్‌ను కూడా చేశాడు.

ఐపీఎల్ నేపథ్యంలో కొన్ని చిట్ చాట్ ఇంటర్వ్యూల్లోనూ మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన హీరో అని తిలక్ వర్మ వెల్లడించాడు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూస్తానని తెలిపాడు. తాను మెగా అభిమానినని స్పష్టం చేశాడు. మాస్ మసాలా సినిమాలతో పాటు స్పోర్ట్స్ డ్రామాలు అంటే ఇష్టమని కూడా తెలిపాడు. RRR సినిమా తనకు బాగా నచ్చిందని, ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు తాను ఫిదా అయ్యానని చెప్పాడు. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరడం గర్వకారణమని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆలస్యంగా(మార్చి 16) హైదరాబాద్‌కు వచ్చిన తిలక్ వర్మ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి సత్కరించారు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం శుక్రవారమే ముంబై చేరిన తిలక్ వర్మ.. ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. తిలక్ వర్మ మెగా అభిమాని అని తెలియడంతో మెగా ఫ్యాన్స్ అతన్ని ఓన్ చేసుకుంటున్నారు.

Story first published: Saturday, March 21, 2026, 20:54 [IST]
Other articles published on Mar 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+