ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 42 బంతుల్లో 94 పరుగులు చేశాడు.
శుక్రవారమే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసిన అభిషేక్ శర్మ.. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్-ఏ తరఫున బరిలోకి దిగాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 42 బంతుల్లో 94 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మతో పాటు హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం 15 బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ -ఏ టీమ్ 9 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సన్‌రైజర్స్-బీ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ (5/48) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి(3/32) మూడు వికెట్లు తీసాడు. బ్రైడన్ కార్స్‌కు ఒక వికెట్ దక్కింది. సన్‌రైజర్స్ -బీ టీమ్ తరఫున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ 10 పరుగులే చేసి నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండోసారి బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ నిరాశపర్చాడు. రెండు భారీ సిక్స్‌లు బాది ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. మోకాలి గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌కు తాత్కలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, బెంగళూరు)
ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, కోల్‌కతా)
ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (మధ్యాహ్నం 3:30, హైదరాబాద్) - హోమ్ మ్యాచ్
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30, న్యూ చండీగఢ్)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, శివాంగ్ కుమార్, క్రెయిన్స్ ఫులెట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, ప్రఫుల్ హింగే, అమిత్ కుమార్, లియామ్ లివింగ్ స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్.