ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ సన్నాహకాలను ప్రారంభించింది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన కేకేఆర్.. ఈ సారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.
ఈ సన్నాహకాల్లో భాగంగా కేకేఆర్ శుక్రవారం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. జట్టు సభ్యులు రెండు జట్లగా విడిపోయి తలపడ్డారు. అయితే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్లకు తన బ్యాటింగ్‌తో వార్నింగ్ ఇచ్చాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రఘువంశీ చెలరేగడంతో రహానే టీమ్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రఘువంశీతో పాటు న్యూజిలాండ్ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు.

అయితే ఈ సీజన్‌లో రఘువంశీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇంకా క్లారిటీ లేదు. గత సీజన్‌లో కొన్ని సార్లు మూడో స్థానంలో.. మరికొన్ని సార్లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రఘు వంశీ.. ఈ సారి ఏ స్థానంలో ఆడుతాడో చూడాలి. ఫిన్ అలెన్, టీమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, కామెరూన్ గ్రీన్ వంటి టాపార్డర్ బ్యాటర్లు ఉండటంతో రఘువంశీని ఏ స్థానంలో ఆడిస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. కేకేఆర్ ప్రధాన పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.