న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమూల్‌ యాడ్‌ సహాయంతో.. ఆమెకు ప్రపోజ్‌ చేసిన కపిల్ ‌దేవ్‌!!

Kapil Dev recalls his love proposal to Romi Bhatia

హైదరాబాద్: 1983 ప్రపంచకప్ విజయం.. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఓ అద్భుతమైన ఘట్టం. యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నేడు భారత్‌ శాసిస్తుందన్నా.. దేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారిందన్నా ఆ విజయమే అసలు కారణం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌ దేవ్ నేతృత్వంలోని టీమిండియా.. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆటతీరుతో ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. భీకర ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించి నయా ఛాంపియన్‌గా నిలిచింది.

 ప్రేమ సంగతులను నెమరువేసుకున్న కపిల్:

ప్రేమ సంగతులను నెమరువేసుకున్న కపిల్:

1983 ప్రపంచకప్‌లో 175 పరుగులు బాది జింబాబ్వే బౌలర్లకు సింహస్వప్నంలా మారిన కపిల్ ‌దేవ్‌.. తన ప్రేమ విషయంలో మాత్రం ఎలా ముందడుగేయాలో తెలియక తడబడ్డాడట. బాలీవుడ్ హీరోయిన్ నటి నేహా ధూపియాతో ఇటీవల ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌.. నాటి ప్రేమ సంగతులను నెమరువేసుకున్నారు. తన మనసులోని ప్రేమను ప్రేయసి రోమీ భాటియాకి చెప్పేందుకు అమూల్‌ యాడ్‌ను సహాయంగా తీసుకున్నానని పాజీ వెల్లడించారు.

అమూల్‌ యాడ్‌ సాయంతో:

అమూల్‌ యాడ్‌ సాయంతో:

'ఓ రోజు కారులో రోమీ భాటియా, నేను కారులో వస్తున్నాం. దారిలో నా ఫొటో ఉన్న ఓ అమూల్‌ యాడ్‌ హోర్డింగ్‌ కనిపించింది. దానిని రోమీకి చూపించి.. ఫొటో తీయమన్నా‌. ఇప్పుడు ఫొటో ఎందుకని రోమీ నన్ను ప్రశ్నించారు. భవిష్యత్తులో మన పిల్లలకు చూపేందుకని జవాబిచ్చా. విషయం అర్ధంచేసుకున్న రోమీ.. ప్రపోజ్‌ చేస్తున్నావా అంది. అవును అని అన్నాను. రోమీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మొత్తానికి అమూల్‌ యాడ్‌ను‌ నా ప్రేమ కోసం అలా వాడుకున్నా' అని కపిల్ ‌దేవ్‌ తెలిపారు.

రోమీ భాటియా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా:

రోమీ భాటియా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా:

రోమీ భాటియా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా, ఆమె తండ్రి ఒప్పుకున్నా.. ఆమె తాతగారు మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు సందించాడట. చివరకు ఆయనను ఒప్పించేందుకు కపిల్‌ నానా తంటాలు పడ్డారట. ప్రపంచకప్‌ గెలిచేందుకు మూడేళ్ల ముందు (1980)లో రోమీ భాటియా, కపిల్ ‌దేవ్‌ ఓ ఇంటివారయ్యారు. 83 పేరుతో కపిల్‌ దేవ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణెలు కపిల్‌, రోమీలుగా నటిస్తున్నారు. ఈ సన్నివేశం 83 సినిమాలో ఉందట.

 131 టెస్టులు, 225 వన్డేలు:

131 టెస్టులు, 225 వన్డేలు:

ప్రపంచ దిగ్గజ ఆల్‌రౌండర్‌లో ఒకరైన కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన విషయం తెలిసిందే. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ ‌సాధించిన 175 పరుగులు ఇప్పటికే సుపరిచితమే. కపిల్ స్ఫూర్తితో ఎంతో మంది యువుకులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపారు. 16 ఏళ్లపాటు టీమిండియా తరఫున ఆడిన కపిల్.. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5248 రన్స్, 434 వికెట్లు.. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు తీశారు. 9 సెంచరీలు కూడా చేశారు.

ఇకనుంచి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏజ్‌ లిమిట్.. ఎంతో తెలుసా?

Story first published: Friday, November 20, 2020, 16:09 [IST]
Other articles published on Nov 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X