న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kuldeep Yadavపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు: చిన్ననాటి కోచ్

Kapil Dev Pandey says Kuldeep ready for a restart with new googly in his armoury
Dhoni సలహాలు మిస్ అవుతున్నా, Pant ఇంకా ఎదగాలి - Kuldeep Yadav || Oneindia Telugu

న్యూఢిల్లీ: స్టార్ స్పిన్నర్కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అతని చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతనికి ఒక్క టెస్టు‌లోనూ అవకాశం ఇవ్వలేదని తెలిపాడు. సగం మంది ఆటగాళ్లు గాయపడినా అతన్ని ఆడించలేదని గుర్తు చేశాడు. ఇక వరల్డ్ టెస్టుచాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై ఈ మణికట్టు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ బాధపడ్డాడని, అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని దేవ్‌ పాండే చెప్పుకొచ్చాడు.

ఆ బంతులే ప్రధాన అస్త్రాలు..

ఆ బంతులే ప్రధాన అస్త్రాలు..

ఇక శ్రీలంక పర్యటనకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన భారత రెండో జట్టును ఆలిండియా క్రికెట్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ జట్టులోకుల్దీప్ యాదవ్ సైతం చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే పాండే ఓ జాతీయ చానె‌ల్‌తో మాట్లాడుతూ తన శిష్యుడిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కుల్దీప్‌ బౌలింగ్‌లో గూగ్లీ బంతులే ప్రధాన అస్త్రాలు. ఆ బంతులు ఎప్పుడూ అతనికి వికెట్లు దక్కేలా చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు.

ప్రత్యేక దృష్టి..

ప్రత్యేక దృష్టి..

ఏదో ఒక బంతి సరైన లెంగ్త్‌లో పడటం తప్ప మిగతావన్నీ ఎక్కడెక్కడో పిచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజులుగా తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాడు. బాగా సాధన చేసి సరైన లెంగ్త్‌తో ఇప్పుడు బంతులు వేయగలుగుతున్నాడు. అతడు వికెట్‌ టేకర్‌గా ఉంటూ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసేవాడు. అయితే, ఇప్పుడు తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని జోడించాలని నిర్ణయించుకున్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల్ని నియంత్రించాలనుకుంటున్నాడు.

సవతి తల్లి ప్రేమ..

సవతి తల్లి ప్రేమ..

కుల్‌దీప్‌ ఇంకా మ్యాచ్‌ విన్నరే. ఇటీవల సరైన అవకాశాలు రాకపోవడంతో అతని ఆత్మవిశ్వాసం లోపించింది. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా అతనికి అవకాశాలు ఇవ్వలేదు. గత పర్యటనలో సగం మంది ఆటగాళ్లు గాయాలబారిన పడినా ఒక్క టెస్టులోనూ ఆడించలేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కూడా అవకాశం ఇవ్వలేదు. అతన్ని అతడిని ఆడించి ఉంటే 30 వికెట్లు తీసేవాడు. ఐపీఎల్‌లోనూ అతన్ని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ మాట అనాలని లేకున్నా.. జట్టు యాజమాన్యం అతనిపై 'సవతి తల్లి ప్రేమ' చూపిస్తుందనే అభిప్రాయం కొన్నిసార్లు కలుగుతుంది. 'అని పాండే చెప్పుకొచ్చాడు.

లాస్ట్ చాన్స్..

లాస్ట్ చాన్స్..

కుల్దీప్ గత రెండేళ్లుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐదు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్‌ తీసిన అతను ఈసారి తొలిభాగంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లంక పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాలి. అయితే తుది జట్టులో చోటు దక్కడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కుల్దీప్‌కు ఇదే చివరి అవకాశం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అతను ఈ సిరీస్‌లో రాణిస్తేనే మళ్లీ టీమిండియాకు ఆడతాడని లేకుంటే కెరీర్ ముగిసినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, June 11, 2021, 19:03 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X