న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా నేను చేసిన ఆ తప్పిదమే ఓటమికి కారణమైంది: కేన్ విలియమ్సన్

Kane Williamson says Using our resources a little early didnt work After 54-run Loss To KKR

పుణే: కెప్టెన్‌గా తాను చేసిన ఘోర తప్పిదం తమ జట్టు ఓటమికి కారణమైందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. చివరి ఓవర్ వాషింగ్టన్‌ సుందర్‌తో వేయించడం మిస్ ఫైర్ అయిందని తన తప్పిదాన్ని అంగీకరించాడు.

ఆలోచన లేకుండా బౌలింగ్ వనరులను ముందుగానే ఉపయోగించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు. ఈ ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్ చెలరేగడంతో మూమెంటమ్ మారిపోయిందన్నాడు. ఈ ఓవర్ కట్టడిగా వేసుంటే కేకేఆర్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేదని, అప్పుడు విజయం సులువయ్యేదని చెప్పాడు.

రస్సెల్ దెబ్బకొట్టాడు..

రస్సెల్ దెబ్బకొట్టాడు..

'ఈ మ్యాచ్ ఫస్టాఫ్‌లో మేం అద్భుతంగా రాణించాం. కానీ ఆండ్రూ రస్సెల్ మా అవకాశాలను దెబ్బతీసాడు. అతనితో ఎప్పుడూ ముప్పే. ఇక చేజింగ్‌లో మేం భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు ప్రయత్నించాం. కానీ కేకేఆర్ సూపర్ బౌలింగ్‌తో మమ్మల్ని దెబ్బతీసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా మేం మూమెంటమ్ అందుకోవడంలో తడబడుతున్నాం. చివరి ఓవర్‌లో సుందర్‌కు బౌలింగ్ ఇవ్వడం తప్పిదమైంది. ముందుగానే పేస్ వనరులను ఉపయోగించుకోవడం దెబ్బతీసింది. మంచి ఆరంభంతో పాటు మూమెంటమ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మ్యాచ్‌ మాకు ఓ గుణపాఠం'అని కేన్ చెప్పుకొచ్చాడు.

రస్సెల్ విధ్వంసం..

రస్సెల్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.

అభిషేక్ ఒక్కడే..

అభిషేక్ ఒక్కడే..

అనంతరం సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో 43), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో 3 సిక్స్‌లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

ప్లే ఆఫ్స్ సంక్లిష్టం..

ప్లే ఆఫ్స్ సంక్లిష్టం..

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం. కోల్‌కతాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను 99.9శాతం చేజార్చుకుంది. 12 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ మిగిలిన 2 గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. రెండు విజయాలు నమోదు చేసినా ఇతర జట్ల ఫలితాలు.. నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

Story first published: Sunday, May 15, 2022, 7:58 [IST]
Other articles published on May 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X