న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jos Buttler ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్.. రైనా, ధావన్‌కు దక్కని చోటు!

Jos Buttler picks his all-time IPL XI, no place for Suresh Raina and Shikhar Dhawan

లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ , రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. 2016 సీజన్ నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న ఈ ఇంగ్లండ్ ప్లేయర్.. ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2018 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు. తన 5 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కరోనాతో ఆగిపోయిన తాజా సీజన్‌లోనూ బట్లర్ దుమ్ములేపాడు.

ఏడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీతో 254 రన్స్ చేశాడు. లీగ్ అర్థాంతరంగా వాయిదా పడటంతో స్వదేశం వెళ్లిన బట్లర్.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ తన ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్‌ను ప్రకటించాడు.

 శిఖర్ ధావన్‌కు నో చాన్స్..

శిఖర్ ధావన్‌కు నో చాన్స్..

ఈ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు తన పేరును ప్రకటించుకున్నాడు. లీగ్‌లో సక్సెస్‌ఫుల్ ఓపెనర్‌, సెకండ్ హయ్యెస్ట్ రన్నర్ అయిన శిఖర్ ధావన్‌(5577)ను పక్కనపెట్టాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్‌లో 66 ఇన్నింగ్స్‌లు ఆడిన బట్లర్ 1968 రన్స్ చేశాడు. అతనితో పాటు 150 స్ట్రైక్‌రేట్ ఉన్న హిట్ మ్యాన్‌ను ఎంచుకున్నాడు.

మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీలను తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ 6076 రన్స్ హయ్యెస్ట్ స్కోరర్‌గా ఉండగా.. డివిలియర్స్ విధ్వంసకర బ్యాటింగ్ గురించి అందరికి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు దూరంగా ఉన్నా.. అతని బ్యాటింగ్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని ప్రతీ సీజన్‌లో మిస్టర్ 360 నిరూపిస్తున్నాడు.

రైనాకు నో చాన్స్..

రైనాకు నో చాన్స్..

ఇక సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన ధోనీని బట్లర్ తన ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తాడు. పైగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌, వికెట్ కీపర్‌గా ధోనీ సాధించిన ఘనతలు మరెవరూ అందుకోలేదు. అందుకే అతన్ని కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా ఎంచుకున్నాడు. అయితే ఐపీఎల్‌కే మారుపేరైన సురేశ్ రైనాను బట్లర్ పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. రైనా 5491 రన్స్‌తో లీగ్ థర్డ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా‌లను ఆల్‌రౌండర్లుగా, బెస్ట్ ఫినీషర్లుగా జట్టులోకి తీసుకున్నాడు. ఈ ఇద్దరు ఎంత విధ్వంసకర ఆల్‌రౌండర్లో అందరికి తెలిసిందే.

బుమ్రా, మలింగా..

బుమ్రా, మలింగా..

ఇక పేస్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలరు. డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేయరు. ఎన్నో మ్యాచ్‌ల్లో తమ సూపర్బ్ బౌలింగ్‌తో విజయాలందించారు. జడేజా తర్వాత ఏకైక స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్‌ను బట్లర్ ఎంపిక చేశాడు. ఎంతో అనుభవం కలిగిన హర్భజన్ సింగ్ ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 150కి పైగా వికెట్లు తీశాడు.

జోస్ బట్లర్ ఆల్‌టైల్ ఐపీఎల్ ఎలెవన్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా

Story first published: Sunday, May 16, 2021, 16:52 [IST]
Other articles published on May 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X