For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన పంత్, అగర్వాల్.. ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

India vs New Zealand: Rishabh Pant, Mayank excels with bat as practice match ends in draw

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. న్యూజిలాండ్ ఎలెవన్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లకు కావాల్సిన ప్రాక్టీస్ లభించింది. 59/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ ఆటను ప్రారంభించిన భారత్.. ఆటముగిసే సమయానికి 48 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.

ఫామ్‌లోకి పంత్, మయాంక్

ఫామ్‌లోకి పంత్, మయాంక్

తొలి రోజు బ్యాటింగ్‌లో విఫలమైన భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) అద్భుత హాఫ్ సెంచరీతో టచ్‌లోకి రాగా.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 81)కూడా ఫామ్‌లోకి వచ్చాడు. ఫలితంగా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

షా, శుభ్‌మన్ మళ్లీ విఫలం..

షా, శుభ్‌మన్ మళ్లీ విఫలం..

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి తప్పూ చేయలేదు. దూకుడైన షాట్లతో పృథ్వీ షా, మయాంక్‌ వేగంగా పరుగులు రాబట్టారు. రెండో రోజు చివరకు వచ్చేసరికి పిచ్‌ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం కూడా వీరికి కలిసొచ్చింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో తామిద్దరిని అవుట్‌ చేసిన కుగ్‌లీన్‌ బౌలింగ్‌లో విరుచుకుపడిన వీరిద్దరు 3 ఓవర్లలోనే 34 పరుగులు బాదారు. భారత్‌ ఇన్నింగ్స్‌ 8.42 రన్‌రేట్‌తో సాగడం విశేషం.

అయితే ఈ మంచి ఆరంభాన్ని పృథ్వీషా(39) భారీ ఇన్నింగ్స్‌గా మార్చుకోలేకపోయాడు. మూడో రోజు తన ఓవర్‌నైట్ ఇన్నింగ్స్‌కు మరో నలుగు పరుగులు మాత్రమే జోడించి మిచెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్(13) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. మిచెల్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు బోల్తపడ్డాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించి మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

సాహా, అశ్విన్..

సాహా, అశ్విన్..

చివర్లో వృద్ధిమాన్ సాహా(30 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో మెరిసిన తెలగు కుర్రాడు హనుమ విహారీ, నయావాల్ చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ చేయలేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ ఎలెవన్ 235 రన్స్‌కు కుప్పకూలిన విషయం తెలిసిందే.

 ఓపెనర్లుగా...

ఓపెనర్లుగా...

తొలి ఇన్నింగ్స్‌లాగే మరో సారి ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌లనే పంపడం చూస్తే తొలి టెస్టులో వీరిద్దరినే ఆడించే ఆలోచనతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే టెస్టు అరంగేట్రం కోసం శుబ్‌మన్‌ గిల్‌ మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్( విహారి 101, పుజారా 93), న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 235 ఆలౌట్(కూపర్ 40, రవీంద్ర 34)

భారత్ రెండో ఇన్నింగ్స్ : 252/4( పంత్ 70, మయాంక్ 81)

Story first published: Sunday, February 16, 2020, 10:06 [IST]
Other articles published on Feb 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+