న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 Retention: చెన్నైతోనే జడేజా, రాయుడు.. మ్యాచ్ విన్నర్‌పై వేటు.. సీఎస్‌కే రిటెన్షన్ జాబితా ఇదే!

IPL 2023 Retention: CSK retained Players, released players and Purse Remaining ahead of mini Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ జాబితాను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ప్రకటించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టు వీడుతున్నాడనే ఊహాగానాలకు తెరదించుతూ రిటైన్ చేసుకుంది. గతేడాది చెన్నై సారథిగా ఎంపికైన జడేజా.. ఒత్తిడిని అధిగమించలేక దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతని సారథ్యంపై వేటు వేసిన చెన్నై.. మళ్లీ ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించింది. గాయంతో చివరి మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. దాంతో అతను జట్టును వీడుతున్నాడనే ప్రచారం జరిగింది.

ముందు నుంచి చెప్పినట్లే సీఎస్‌‌కే అతన్ని అంటిపెట్టుకుంది. రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ విధించిన గడువు ముగియడంతో ఫ్రాంచైజీలన్నీ అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ రిటెన్షన్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది.

ఇక తమ జట్టుకు ఎన్నో విజయాలందించిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోపై వేటు వేసింది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారిపట్టిన చెన్నై.. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే జట్టును బలంగా మార్చడంపై ఫోకస్ పెట్టింది. ‌ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో పాటు వయసు మీద పడి రాణించలేకపోతున్న ప్లేయర్లకు ఉద్వాసన పలికింది. డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే, హరీ నీషాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కేఎమ్ ఆసీఫ్, నారయణ్ జగదీషన్‌ను విడుదల చేసింది. దీంతో చెన్నై పర్స్‌లో రూ.20.45 కోట్లు ఉన్నాయి. ఓ మంచి ఆల్‌రౌండర్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్‌ను తీసుకోవచ్చు.

ఇక ధోనీతో పాటు డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాన్షు సేనాపతి, మోయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, సిమర్జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణలను రిటైన్ చేసుకుంది. అంటి రాయుడిని వదిలేస్తారని ప్రచారం జరిగినా.. అతనిపై సీఎస్‌కే యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది.

చెన్నై రిటెన్షన్ లిస్ట్:
మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాన్షు సేనాపతి, మోయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, సిమర్జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణ

చెన్నై విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా:

డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే, హరీ నీషాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కేఎమ్ ఆసీఫ్, నారయణ్ జగదీషన్‌

Story first published: Tuesday, November 15, 2022, 21:08 [IST]
Other articles published on Nov 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X