న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: పంజాబ్ X ఢిల్లీ.. ఏది గెలిచినా ఆర్‌సీబీకే బొక్క! కోహ్లీ టీమ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

IPL 2022 Playoff Scenario: Tough Road Ahead for RCB

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆసక్తికర మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఐపీఎల్ 2022 సీజన్ పాయింట్ల పట్టికలో టాప్-4లోకి వెళ్లనుండగా.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కిందకి పడిపోనుంది.

నెగటీవ్ రన్‌రేట్‌తో...

నెగటీవ్ రన్‌రేట్‌తో...

తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అలానే పంజాబ్ కింగ్స్‌ కూడా 12 మ్యాచ్‌లకిగానూ ఆరింట్లో గెలిచింది. దాంతో.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన టీమ్ 14 పాయింట్లతో పట్టికలో బెంగళూరు ప్లేస్‌లోకి వెళ్లనుంది. వాస్తవానికి బెంగళూరు ఖాతాలో కూడా ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయి. కానీ.. ఆర్‌సీబీ(-0.323) నెట్‌ రన్‌రేట్‌తో పోలిస్తే? ఢిల్లీ క్యాపిటల్స్ (+0.210), పంజాబ్ కింగ్స్‌ (+0.023) రన్‌రేట్ మెరుగ్గా ఉంది.

80 రన్స్ లేదా 10 ఓవర్లలో..

80 రన్స్ లేదా 10 ఓవర్లలో..

ఈ క్రమంలోనే నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా ఆర్‌సీబీకి నష్టం చేకూరనుంది. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే గుజరాత్‌తో మే 19న జరిగే చివరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయాలి. ప్రస్తుతం నెగటీవ్‌గా ఉన్న రన్ రేట్ పాజిటీవ్‌గా మారాలంటే.. సుమారు 80 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకోవాలి. లేదా చేజింగ్‌లో అయితే 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలి. ఇది జరగాలంటే అద్భుతమే జరగాలి.

టాప్-3 టీమ్స్‌ కన్ఫామ్..

టాప్-3 టీమ్స్‌ కన్ఫామ్..

అయితే ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ గుజరాత్‌పై విజయం సాధిస్తే 16 పాయింట్లు సాధిస్తోంది. 20 పాయింట్లతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. లక్నో, రాజస్థాన్ 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రన్ రేట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఈ రెండు జట్లు చివరి మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు డోకా ఉండదు. గ్రహచారం బాలేక చిత్తుగా ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే.

ముంబై చేతిలో ఆర్‌సీబీ భవితవ్యం..

ముంబై చేతిలో ఆర్‌సీబీ భవితవ్యం..

ఆర్‌సీబీ 16 పాయింట్లు సాధిస్తే.. పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా ఇతర మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. అప్పుడు ఆర్‌సీబీకి అవకాశం ఉంటుంది. ఢిల్లీ తుదపరి మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా లక్నోతో, పంజాబ్.. హైదరాబాద్ చేతిలో ఓడాలి. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై... తదుపరి మ్యాచ్‌ల్లో హైదరాబాద్, పంజాబ్‌లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధిస్తే ఆర్‌సీబీకి లైన్ క్లియర్ అవుతోంది.

Story first published: Monday, May 16, 2022, 16:18 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X