న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ అతి తెలివి.. ఆక్షనర్ ఘోర తప్పిదం! ఆగమైన అంబానీ టీమ్! (వీడియో)

IPL 2022: Auctioneer Charu Sharma mistakenly sells Khaleel Ahmed to Delhi Capitals instead of Mumbai Indians

న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం రెండు రోజుల పాటు అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.
600 మంది పోటీదారుల్లో 204 మందికే అవకాశం‌‌‌ దక్కింది. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు రూ. 550 కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో రూ. 126 కోట్లు కేవలం 11 మందిపైనే కుమ్మరించాయి. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌లో 28 మంది ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. గతానికి భిన్నంగా సాగిన ఈ వేలంలో కొందరు ఊహించని ధర పలికితే.. స్టార్లు అనుకున్న వాళ్లలో చాలా మంది అన్‌‌‌‌సోల్డ్‌ జాబితాలో చేరారు. మధ్యలో కుర్రాళ్లు లాభపడినా.. విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి.

కిరణ్ కుమార్ గ్రాంధీ..

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధీ అతి తెలివి కారణంగా ఆక్షనర్ చారు శర్మ ఘోర తప్పిదం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలి రోజు వేలంలోనే ప్రధాన ఆక్షనర్ హ్యూస్ ఎడ్మెడ్స్ డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోవడంతో ప్రముఖ కామెంటేటర్ చారూ శర్మ బాధ్యతలు చేపట్టాడు. అయితే భారత ప్లేయర్ ఖలీల్ అహ్మద్ విషయంలో చారు శర్మ ఘోర తప్పిదం చేశాడు. వేలంలో ఖలీల్ అహ్మద్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడ్డాయి. దాంతో అతని ధర రూ.5 కోట్లు ధాటింది.

చారు శర్మ అయోమయం..

చారు శర్మ అయోమయం..

ఇక రూ.5.25 కోట్లకు ముంబై బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.50 కోట్లకు బిడ్ చేయాల్సింది. కానీ ఇక్కడ ఢిల్లీ కో ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధీ ఉద్దేశపూర్వకంగా చేశాడో లేక అతి తెలివి ప్రదర్శించాడో కానీ కార్డ్ ఎత్తి.. లేదంటూనే చారు శర్మను తప్పుదారి పట్టించాడు. అతని చర్య వల్ల బిడ్ అమౌంట్ మర్చిపోయిన చారు శర్మ మళ్లీ రూ.5.25 కోట్ల వద్దనే ముంబై అభిప్రాయాన్ని కోరాడు. వాళ్లు కూడా బిడ్ అమౌంట్ మర్చిపోయి వద్దని చెప్పారు. దాంతో ఖలీల్ అహ్మద్ తక్కువ ధరకే దొరికిపోయాడు.

IPL Auction 2022 : PBKS Owner Shows His Anger On Auctioneer During The Auction | Oneindia Telugu
వార్నర్ అగ్గువకే..

వార్నర్ అగ్గువకే..

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ ఓనర్ తెలివి అంటే తెలివేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ తన తెలివితో అందరి ప్లేయర్లను అగ్గువకే సొంతం చేసుకున్నాడని కొనియాడుతున్నారు. ఇక ఐపీఎల్ బ్రాండ్ అంబాసీడర్ అయిన డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకే సొంతం చేసుకున్న ఢిల్లీ.. మంచి ప్లేయర్లను ఎగరేసుకుపోయింది. రెండు రోజుల పాటు వేలంలో దూకుడు కనబర్చింది. ప్రతీ స్టార్ ప్లేయర్‌కు బిడ్ వేసింది.

Story first published: Tuesday, February 15, 2022, 19:36 [IST]
Other articles published on Feb 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X