న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Auction: పృథ్వీషాపై కన్నేసిన ఆ మూడు జట్లు!

IPL 2022 Auction: 3 Teams Which Can Target Prithvi Shaw
Prithvi Shaw కోసం చూస్తున్న SRH, MI | DC లో అయ్యర్‌, పంత్‌ | IPL 2022 Auction || Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడం లేదు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌ విజయంతో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన ఈ యువ కెరటం.. అదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఓపెనర్‌గా దుమ్మురేపిన షా.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మధ్యలో నిలకడలేమి ఆటతో సతమతమైనా.. డొమెస్టిస్ క్రికెట్‌లో సత్తా చాటాడు.

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ 8 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 308 రన్స్ చేసి నాలుగో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పృథ్వీ షా మళ్లీ ఢిల్లీ తరఫున బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

షాకు నో చాన్స్..

షాకు నో చాన్స్..

మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు ఐదుగురు ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు. ఇందులో ఒక ఫారిన్ ప్లేయర్‌ను కలుపుకొని మొత్తం ముగ్గురిని నేరుగా తీసుకునే అవకాశం ఉండగా.. మరో ఇద్దరిని రైట్ టూ మ్యాచ్(ఆర్‌టీఎమ్) ద్వారా తీసుకోవచ్చు. రైట్ మ్యాచ్ ద్వారా కూడా ఒకే ఫారిన్ ప్లేయర్‌ను తీసుకునే వెసులు బాటు ఉంది. అయితే వచ్చే ఏడాది మెగా వేలం జరిగితే మాత్రం ఢిల్లీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో పృథ్వీషాకు చోటు దక్కకపోవచ్చు. ఆ జట్టు భారత ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్‌తో పాటు రిషభ్ పంత్‌ను రిటైన్‌ చేసుకునే అవకాశం ఉంది. దాంతో షాకు ఉద్వాసన తప్పెలా లేదు. అదే జరిగి షా వేలంలోకి వస్తే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడుతాయి. ముఖ్యంగా ఓ మూడు జట్లు అయితే అతని కోసం వేలంలో ఏందాకైనా తెగించనున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

పృథ్వీషా కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ జట్టు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటే గెలిచి పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ముఖ్యంగా ఆ జట్టు బలహీనమైన మిడిలార్డర్‌‌తో పాటు భారత ఆటగాళ్ల వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. సరైన ఆటగాళ్లను తీసుకోవడంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ జట్టు వచ్చే సీజన్‌లో భారత ఆటగాళ్లపై దృష్టి పెట్టనుంది. షాను తీసుకుంటే ఆ జట్టుకు కలిసిరానుంది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఇండియన్ ప్లేయర్ అయితే.. మిడిలార్డర్‌లో మరో ఫారిన్ ప్లేయర్‌ను ఆడించే వెసులుబాటు ఆ టీమ్‌కు కలుగుతుంది.

ముంబై ఇండియన్స్..

ముంబై ఇండియన్స్..

మెగా వేలం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సేవలను కోల్పోనుంది. ట్రెంట్ బౌల్ట్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో డికాక్‌కు ఉద్వాసన తప్పెలా లేదు. అదే జరిగితే ముంబైకి ఓ స్టార్ ఓపెనర్ కావాలి. కాబట్టి ఆ జట్టు కచ్చితంగా పృథ్వీ షా‌పై కన్నేయనుంది. పైగా పృథ్వీషాకు ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే పరిస్థితులు కలిసిరానున్నాయి. వాంఖడే ఫ్లాట్ వికెట్‌పై పృథ్వీ చెలరేగగలడు. పైగా స్ట్రాంగ్ మిడిలార్డర్‌ ఉండే ముంబై జట్టులో షా.. మరింత స్వేచ్చగా ఆడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోహిత్‌తో షా జతకడితే మైదానంలో పరుగుల విధ్వంసమే. రోహిత్ యాంకర్ రోల్ పోషిస్తే షా.. చెలరేగగలడు. అంతేకాకుండా మేగా వేలంలో నేపథ్యంలో ముంబై జట్టుకు భారత ఆటగాళ్లను కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకోవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్..

రాజస్థాన్ రాయల్స్..

రాజస్థాన్ రాయల్స్ జట్టులో మ్యాచ్ విన్నింగ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కెప్టెన్ సంజూ శాంసన్ మినహా చెప్పుకోదగ్గ నాణ్యమైన భారత బ్యాట్స్‌మన్ లేరు. పృథ్వీ షా లాంటి విధ్వంసకర ఓపెనర్ ఆ జట్టుకు సరిగ్గా సరిపోతాడు. జోస్ బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. పృథ్వీషా చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ బలంగా మారనుంది. యశస్వీ జైస్వాల్, మనన్ వోహ్రాలను ఓపెనర్లుగా ఆడించినా ఫలితం లేకపోయింది. షా గనుక ఓపెనర్‌గా బరిలోకి దిగి రాణిస్తే.. కెప్టెన్ శాంసన్, స్టోక్స్‌ ఒత్తిడి లేకుండా మూడు, నాలుగు స్థానాల్లో చెలరేగవచ్చు.

Story first published: Sunday, May 30, 2021, 16:12 [IST]
Other articles published on May 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X