న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ సింగిల్స్ కోసం కాకుండా భారీ షాట్లు ఆడాలి: సునీల్ గవాస్కర్

IPL 2021: Sunil Gavaskar wants Virat Kohli to stick to his strengths
IPL 2021 : Virat Kohli బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి... AB de Villiers పై Gavaskar ప్రశంసలు| Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో జోరు కనబరుస్తున్నా.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 163 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ అయితే మరి దారుణంగా 126 ఉంది. సహచర ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడుతుంటే కోహ్లీ విఫలమవ్వడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ సెకండాఫ్‌లోనైనా కోహ్లీ బ్యాట్ ఝులిపించాలని కోరుకుంటున్నారు. అయితే బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సింగిల్స్ తీయడం మానేసి అతని బలాలపై దృష్టిసారించాలన్నాడు.

బలాలను నమ్ముకోవాలి..

బలాలను నమ్ముకోవాలి..

'ప్రతీ సారి సూపర్ బ్యాటింగ్‌తో విరాట్ హై స్టాండార్డ్స్ సెట్ చేశాడు. ప్రజలంతా అతని నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. నేను విరాట్‌కు చెప్పేది ఒక్కటే సింగిల్స్ తీయడం మానేసి బలాలపై దృష్టిసారించాలి. అతను సాధాసిదా ఇన్నింగ్స్‌లు ఆడటం మానేసి.. మ్యాచ్ విన్నర్‌గా నిలవాలి. ఢిల్లీతో మ్యాచ్‌లో విరాట్ ఏం చేశాడు? అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. అతను బంతి హిట్ చేయడంపై దృష్టి సారించాలి. ఎక్స్‌ట్రా కవర్ దిశలో అతను సులువుగా డ్రైవ్ షాట్స్ ఆడగలడు. అదే అతని బలం. తదుపరి మ్యాచ్‌ల్లో ఆ తరహా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. అతను తన బలాలను నమ్ముకుంటే సులువుగా పరుగులు చేయగలడు'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఓ టార్గెట్ సెట్ చేశాడు..

ఓ టార్గెట్ సెట్ చేశాడు..

ఇక ఐపీఎల్‌లో 6 వేలు మైలురాయి అందుకున్న విరాట్‌ను గవాస్కర్ ప్రశంసించాడు. 'కోహ్లీ తన ఆటతో అగ్ర భాగాన నిలిచాడు. 6000 పరుగుల మైలు రాయి అందుకొని ఇతరులకు ఓ టార్గెట్ సెట్ చేశాడు. ఇతర ఆటగాళ్లు కూడా ఆ రికార్డు‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే రోహిత్ శర్మ, సురేశ్ రైనా 5000 వేల పరుగుల మైలు రాయిని అధిగమించారు. వారు 6000 పరుగులకు చేరుకోవాలని భావిస్తారు.'అని గవాస్కర్ తెలిపాడు.

ఏబీడీ సూపర్..

ఏబీడీ సూపర్..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఏబీ బ్యాటింగ్‌ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలలేదన్నాడు. అమోఘమైన ఇన్నింగ్స్‌ ఆడాడని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని బెంగళూరుకు సన్నీ సూచించాడు. 'ఏబీ డివిలియర్స్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ముఖ్యంగా బ్యాట్‌ ఫేస్‌ ఓపెన్‌ చేసి తను కొట్టిన ఓ సిక్సర్‌ హైలెట్‌. ఆ థర్డ్‌మాన్‌ మీదుగా కొట్టిన షాట్‌ ఫేవరెట్‌. ఏబీడీ ఒక జీనియస్‌. తను బ్యాటింగ్‌ చేస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోతా. అతడిని ఓపెనర్‌గా ఎందుకు పంపించకూడదు. అలా అయితే తన విశ్వరూపం మరింతగా చూసే అవకాశం లభిస్తుంది. ఏబీడీ 20 ఓవర్ల ఆట చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఒక బ్యాట్స్‌మెన్‌గా ఏబీడీ ఇలాంటి భీకరమైన ఫాంలో ఉన్నపుడు నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది' అని అన్నాడు.

Story first published: Thursday, April 29, 2021, 16:59 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X