న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నో వార్నర్.. నో కేన్ మామ.. 3డీ శంకరన్నను కెప్టెన్ చేయండి! సన్‌రైజర్స్ టీమ్‌పై ఫ్యాన్స్ సెటైర్స్!

IPL 2021 Returns: SRH Fans Trolls Sunrisers Hyderabad Team Check Out The Reactions Here
IPL 2021 Returns అయితే ఎందీ? SRH పొడిచేదేమి లేదు No Warner, Kane - Fans || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. శనివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 25 రోజుల్లో లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపిన బోర్డు.. షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసి సొంత అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఐపీఎల్ 2021 రిటర్న్స్ అనే ఫొటోను ట్వీట్ చేయగా.. ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మనకు అవసరమా..?

భారత్ వేదికగా ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక మ్యాచ్ గెలిచి ఆరింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. బలహీనమైన మిడిలార్డర్, జట్టులోని భారత ఆటగాళ్ల వైఫల్యం సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాయి. ఓడి ఆరింటిలో ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు సులువుగా గెలిచేదే. కానీ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు‌కు విజయాన్నందించే ఆటగాళ్లు లేకపోవడంతో ఓటమిపాలైంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన అభిమానులు.. ఐపీఎల్ రిస్టార్ట్ అయితే ఎందీ? కాకపోతే ఏందీ అనే నైరాశ్యంలో కామెంట్ చేస్తున్నారు. యూఏఈ వేదికగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు రాణించేది ఏం ఉండదని, ఉన్న పరువు కూడా పోతుందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

నో కేన్, వార్నర్..

ఇక సెప్టెంబర్-అక్టోబర్ మధ్య రిస్టార్ట్ కానున్న ఐపీఎల్‌కు ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ విషయంపై ఎస్‌జీఎంలో చర్చించిన బీసీసీఐ.. ఓవర్‌సీస్ ఆటగాళ్ల గైర్హాజరీపై ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. వారు అందుబాటులో ఉన్నా లేకున్నా.. ప్లాన్ ప్రకారమే లీగ్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతుందని, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడే అవకాశం ఉన్నా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ ప్లేయర్లపై స్పష్టత లేదని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ధీన్ని బట్టి చూస్తే.. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్‌ల సేవలను కోల్పోనుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు బోర్డుపై సెటైర్లు పేల్చుతున్నారు.

3డీని కెప్టెన్ చేయండి..

డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉన్నా.. అతని సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ సారథిగా, ప్లేయర్‌గా కొనసాగించలేదని, కేన్ విలియమ్సన్, బెయిర్ స్టో గైర్హాజరీలో జట్టు ఏం రాణిస్తుందని ప్రశ్నిస్తున్నారు. త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను కెప్టెన్ చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలా కాకుంటే మనీష్ పాండేకు జట్టు బాధ్యతలు అప్పగించాలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అభిమానుల మద్దతును సన్‌రైజర్స్ కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు స్టార్ ప్లేయర్లు అయిన విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మనీశ్ పాండే గాయపడవద్దని, అందుకోసం సన్‌రైజర్స్ ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలని ఎగతాళి చేస్తున్నారు.

తప్పుకోవడం ఉత్తమం..

ఇంకొందరు అభిమానులైతే లీగ్ నుంచి తప్పుకోవడం ఉత్తమమని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. వార్నర్, కేన్, బెయిర్ స్టో ఉండని ఈ జట్టు ఏం ఆడుతుందని ఇంకొకరు ప్రశ్నించారు. ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుందనే సంతోషం ఏ ఒక్క ఆరెంజ్ ఆర్మీ అభిమానికి లేదని మరొకరు అభిప్రాయపడ్డారు. టికెట్లు, హోటల్ ఖర్చులు బొక్క తప్పా ఎలాంటి ఉపయోగం లేదని మరికొందరు కామెంట్ చేశారు. డేవిడ్ వార్నర్ జట్టులోకి తీసుకురాకపోతే.. బాగుండదని కూడా హెచ్చరిస్తున్నారు.

Story first published: Saturday, May 29, 2021, 16:04 [IST]
Other articles published on May 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X