న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs SRH: సన్‌రైజర్స్ రాత మారేనా? కేదార్ జాదవ్‌కు చాన్స్.. కేన్ మామ డౌట్! తుది జట్లు ఇవే!

IPL 2021: PBKS vs SRH Dream11 Team Prediction, Tips, Best Playing 11 Details

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో అప్పుడే 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప మిగిలిన జట్లన్నీ బోణీ కొట్టాయి. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. ఆరంభంలో దంచికొట్టడం.. లక్ష్యంవైపు సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం.. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలి ఓటమిని ఆహ్వానించడం.. ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ తీరు. మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం జట్టును చాలా దెబ్బతీస్తోంది.

ఈ నేపథ్యంలో వార్నర్ సేన.. మరో ఆసక్తికర సమరానికి సిద్దమవుతోంది. నేడు(బుధవారం) జరిగే డబుల్ హెడర్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఫస్ట్ మ్యాచ్‌లో తమ కంటే కాస్త మెరుగ్గా ఉన్న పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ తలపడుతోంది. సన్‌రైజర్స్.. ఈ పోరుతో గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. మరో పక్క టోర్నీని విజయంతో మొదలుపెట్టిన పంజాబ్.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో సన్‌రైజర్స్‌కు షాకిచ్చి తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

హెడెక్‌‌గా తుది జట్టు ఎంపిక..

హెడెక్‌‌గా తుది జట్టు ఎంపిక..

కాగా, ఓ మాదిరి టార్గెట్స్‌ను చేజ్ చేయలేకపోతున్న హైదరాబాద్‌కు తుది జట్టు ఎంపిక ఓ తలనొప్పిగా మారింది. ఎన్ని కాంబినేషన్స్ మార్చినా ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ సమస్యలు తీరడం లేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు. దాంతో ఈ మ్యాచ్‌లోనూ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉంటే అతను ముజీబ్ రెహ్మాన్ స్థానంలో దిగుతాడు. కానీ అతను ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం.

మిడిలార్డర్‌లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. సాహా, కేదార్ జాదవ్, ప్రియమ్ గార్గ్‌ల్లో ఒకరికి చోటు దక్కవచ్చు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. గతానికి భిన్నంగా సన్‌రైజర్స్ ఈసారి బౌలింగ్‌లోనూ సమస్యలు ఎదుర్కొంటుంది. భువనేశ్వర్ పేలవ పెర్ఫామెన్స్ కొనసాగుతుండగా.. నటరాజన్ ప్లేస్‌లో గత మ్యాచ్ ఆడిన ఖలీల్ అహ్మద్ ఫర్వాలేదనిపించాడు. పరుగులు కట్టడి చేస్తున్న రషీద్ ఖాన్ వికెట్లు తీయలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా నట్టూ ఆడే అవకాశం లేదు.

పటిష్టంగా పంజాబ్

పటిష్టంగా పంజాబ్

ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన పంజాబ్.. ఢిల్లీతో జరిగిన తమ లాస్ట్ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆకట్టుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ టచ్‌లోకి వచ్చాడు. క్రిస్ గేల్, పూరన్‌తో బ్యాటింగ్‌ లైనప్ బలంగా ఉండగా.. బౌలింగ్‌లోనే పంజాబ్‌కు కొన్ని సమస్యలున్నాయి. యంగ్‌స్టర్ అర్షదీప్ ఆకట్టుకుంటుండగా.. పేసర్లు మహ్మద్ షమీ, మెరిడిత్, జే రిచర్డ్‌సన్ భారీగా పరుగులిచ్చుకుంటున్నారు. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరి అవకాశం దక్కవచ్చు.

ముఖా ముఖి

ముఖా ముఖి

ఈ ధనాధన్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా 11 విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాదే పైచేయి సాధించింది. పంజాబ్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. అయితే 2018 నుంచి ప్రతీ సీజన్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలుస్తూ వస్తున్నాయి. పంజాబ్ జట్టుపై డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డుంది. అతను ఆ జట్టుపై ఇప్పటి వరకు 661 రన్స్ చేశాడు. గత సీజన్‌లో ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి. తొలి మ్యాచ్‌లో 69 పరుగుల భారీ తేడాతో గెలవగా.. సెకండ్ మ్యాచ్‌లో పంజాబ్ 12 రన్స్‌తో విజయం సాధించింది.

తుది జట్లు:

తుది జట్లు:

డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(కీపర్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జలజ్ సక్సెనా, జై రిచర్డ్‌సన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్/ మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్ 1

డ్రీమ్ 11 ప్రిడిక్షన్ 1

కేఎల్ రాహుల్(కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా, జై రిచర్డ్‌సన్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్

Story first published: Wednesday, April 21, 2021, 10:14 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X