న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆ వెటరన్ స్పిన్నర్ ఔట్

IPL 2021: Harbhajan Singhs contract with CSK ends
#IPL2021 : Harbhajan Singh's Contract With CSK Ends | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీతో తనకు ఉన్న రెండేళ్లు అనుబంధం ముగిసిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

'ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న నా ఒప్పందం గడువు ముగిసింది. ఈ జట్టు తరఫున ఆడటం ఓ గొప్ప అనుభవం. ఈ ఫ్రాంచైజీతో సాగిన ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప స్నేహితులు దొరికారు. దేన్ని ఎప్పటికీ మరిచిపోను. చెన్నై జట్టు మేనేజ్​మెంట్​, స్టాఫ్​, అభిమానులందరికీ నా ధన్యావాదాలు.'అని భజ్జీ ట్వీట్ చేశాడు.

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2018 వేలంలో హర్భజన్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. రెండేళ్ల పాటు ఆడిన భజ్జీ.. గతేడాది వ్యక్తిగత కారణాలతో బరిలోకి దిగలేదు. ఇక అద్భుత ఐపీఎల్ కెరీర్ కలిగిన భజ్జీ.. 160 మ్యాచ్‌ల్లో 26.44 సగటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 5/18.

గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై.. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలం కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్‌ను వదులుకుంది. మరో 10 ఏళ్లు జట్టును నడిపించే ఆటగాళ్లు తీసుకోవడానికి సమయాత్తం అవుతుంది. ఇందులో భాగంగానే జట్టుకు కుదిబండగా మారిన సీనియర్ ఆటగాళ్లను తీసేయాడానికి కూడా వెనుకాడటం లేదు.

Story first published: Wednesday, January 20, 2021, 13:49 [IST]
Other articles published on Jan 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X