న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చతేశ్వర్ పుజారా సిక్సర్ల మోత.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన నయావాల్(వీడియో)

IPL 2021: Cheteshwar Pujara Smashes Sixes In CSK Nets

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట టీమిండియా నయావాల్, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా.. టీ20 జోష్‌లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ సెషన్‌‌లో చతేశ్వర్ పుజారా భారీ షాట్లతో విరుచుకుపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో పుజారా పునరాగమనం చేస్తుండగా.. అతన్ని రూ.50 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న చతేశ్వర్ పుజారా.. చెన్నై అగ్రశేణి బౌలర్లు దీపక్ చాహర్, కరన్ శర్మ‌తో పాటు నెట్స్ బౌలర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ఎలాంటి బంతులనైనా అలవోకగా స్టాండ్స్‌కు తరలించాడు. చతేశ్వర్ పుజారా చివరిగా 2014లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.

పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా బంతిని డిఫెన్స్ చేయడంలో చతేశ్వర్ పుజారాకి తిరుగులేదు. కానీ.. అతను మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేయగలడా..? అని ఇన్నాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సందేహిస్తూ వచ్చాయి. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే.. మరే ఫ్రాంఛైజీ కూడా అతని కోసం చెన్నైకి పోటీ రాకపోవడంతో కనీస ధర రూ.50 లక్షలకే అతను చెన్నై సొంతమయ్యాడు. పుజారాని చెన్నై కొనుగోలు చేయగానే.. వేలానికి వచ్చిన అన్ని ఫ్రాంఛైజీల ప్రతినిధులు చప్పట్లతో ఆ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. ఇక పుజారా భారీ షాట్లకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

పుజారా తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడగా, 99.74 స్ట్రయిక్‌ రేట్‌తో 390 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ(51) కూడా ఉంది. కాగా, టీమిండియా తరఫున 85 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడకపోవడం విశేషం. ఇదిలా ఉండగా ముంబై వేదికగా ఏప్రిల్‌ 10న జరిగే మ్యాచ్‌లో చెన్నై జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, March 31, 2021, 23:01 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X