న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఆ బీబీఎల్ హీరో కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ.. వేలంలో రికార్డు ధర పలికే చాన్స్!

IPL 2021: 3 teams which can target England batsman James Vince after watching his BBL heroics

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ హీరో జేమ్స్ విన్స్ కోసం ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్.. తనదైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో అండగా నిలిచిన జేమ్స్ విన్స్, బిగ్ బాష్‌ లీగ్‌లో హాట్ ఫేవరేట్‌గా నిలిచాడు. సిడ్నీ సిక్సర్‌ తరఫున బరిలోకి దిగిన ఈ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. ఈసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. చెన్నైలో ఈ నెల 18న నిర్వహించే ఐపీఎల్ మినీ వేలంలో జేమ్స్ విన్స్‌ను తీసుకోవాలని పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

బీబీఎల్‌లో అదరగొట్టి..

బీబీఎల్‌లో అదరగొట్టి..

పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన ఫైనల్లో జేమ్స్ విన్స్ అదరగొట్టాడు. 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేసి టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బీబీఎల్ 10 సీజన్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 38.35 సగటుతో 537 పరుగులు చేశాడు.

అత్యధిక వ్యక్తిగత స్కోర్ 98 నాటౌట్. ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసుకునేవాడే. కానీ ప్రత్యర్థి బౌలర్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వైడ్ వేయడంతో జేమ్స్ విన్స్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. టోర్నీ మొత్తం 59 బౌండరీలు, 11 సిక్స్‌లతో 143.58 స్ట్రైక్‌రేట్ దుమ్ములేపాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఈ ఫించ్ హిట్టర్ బ్యాట్స్‌మెన్ తీసుకోవడానికి మూడు ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచిస్తున్నారు.

 రేసులో చెన్నై సూపర్ కింగ్స్..

రేసులో చెన్నై సూపర్ కింగ్స్..

గత సీజన్‌లో పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చిన చెన్నై ఈ సారి రాణించాలనే పట్టుదలతో సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే సురేశ్ రైనాను రిటైన్ చేసుకున్న ఆ జట్టు ఇప్పుడు.. రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్ స్థానంలో మరో ఓవర్‌సీస్ ప్లేయర్‌ను తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యంతో గత సీజన్‌లో విఫలమైన చెన్నై.. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ కమ్రంలో ఖాళీ అయిన వాట్సన్ స్థానంలో జేమ్స్ విన్స్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఫాఫ్ డూప్లెసిస్‌కు అతను సరైన జోడిగా నిలుస్తాడని ఆశిస్తోంది.

 కోహ్లీసేన కూడా..

కోహ్లీసేన కూడా..

విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఓ ఓవర్‌సీస్ ప్లేయర్‌పై కన్నేసింది. ఆరోన్ ఫించ్‌ను వదిలేసిన ఆ జట్టు.. అతని స్థానంలో ఓ మంచి టాపార్డర్ బ్యాట్స్‌మెన్ తీసుకోవాలనుకుంటుంది. జట్టు పూర్తిగా విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌పై ఆధారపడుతుండటంతో ఆ సమస్యను అధిగమించేందుకు కోచ్ సైమన్ కటిచ్‌తో పాటు డైరెక్టర్ మైక్ హెస్సెన్ ప్రణాళికలు రచిస్తున్నారు. విన్స్ తీసుకుంటే టాపార్డర్ బలం పెరుగుతుందని భావిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ సైతం..

రాజస్థాన్ రాయల్స్ సైతం..

రాజస్థాన్ రాయల్స్‌లో మూడు ఓవర్‌సీస్ ప్లేయర్స్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌నే వదులుకుంది. దాంతో రూ. 35.85 కోట్ల డబ్బుంది. స్మిత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ఆ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్ బలం పెంచుకునేందుకు విన్స్ తీసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ సీజన్ మినీ వేలానికి 1097 ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా మినీ వేలం జరగనుంది.

Story first published: Thursday, February 11, 2021, 14:54 [IST]
Other articles published on Feb 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X