న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: క్రికెట్‌లో ఎక్కువగా వినిపించే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ అంటే ఏమిటి?

IPL 2020: What Is Line And Length, Change Of Pace In Cricket?

హైదరాబాద్: అసలు జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతంగా ప్రారంభమై సగం మ్యాచ్‌లను కూడా పూర్తి చేసుకుంది. అద్భుత మ్యాచ్‌లతో అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా కామెంటేటర్ల నోట లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ పదాలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఇవి ఏంటో చెప్పండని అభిమానులు నేరుగా కామెంటేటర్లనే అడుగుతున్నారు. తెలుగు స్టార్ట్స్ స్పోర్ట్స్ చానెల్ ట్విటర్ వేదికగా #starniaduguలో సందేహాలను తీర్చుకునే అవకాశాన్ని అభిమానులకు ఇచ్చింది. దీంతో చాలా మంది చేంజ్ ఆఫ్ పేస్, లైన్ లెండ్ లెన్త్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతకు అవే ఏంటో తెలుసుకుందాం.

లైన్ అండ్ లెన్త్.. బౌల‌ర్ పాటించాల్సిన బేసిక్ రూల్. ఈ నిబంధనను ఎంత ప‌క్కాగా ఫాలో అయితే బౌల‌ర్ గ్రోత్ అంత‌గా ఉంటుంది. మాములుగా చెప్పాలంటే ఫీల్డింగ్ పెట్టకున్న విధంగా బంతులు వేయ‌డ‌మే లైన్ అండ్ లెన్త్. బ్యాట్స్‌మెన్ ఆడితే బంతి నేరుగా ఫీల్డర్ చేతులోకే వెళ్లాలి. వదిలేస్తే వికెట్ అవ్వడం లేదా ఎల్బీ కావాలి. ఇలా లైన్ అండ్ లెన్త్ బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు.

IPL 2020: What Is Line And Length, Change Of Pace In Cricket?

లైన్: బౌల‌ర్ బంతి వేసే దిశ ... స్టంప్స్‌కు స‌రిగ్గా వేస్తున్నాడా? స్టంప్స్‌కు ఆఫ్ సైడ్, స్టంప్స్‌కు లెగ్ సైడ్... ఇలా వికెట్ల‌ను దృష్టిలో ఉంచుకొని బంతిని వేసే దిశ‌నే లైన్ అంటారు.

IPL 2020: What Is Line And Length, Change Of Pace In Cricket?

లెన్త్: బౌలింగ్ ఎండ్ స్టంప్స్‌కు బ్యాంటింగ్ ఎండ్ స్టంప్స్‌కు మ‌ద్య 22 యార్డ్స్ దూరం ఉంటుంది. దీనిని రెండు భాగాలుగా చేస్తే స్ట్రైకింగ్ వైపు ఉండే పిచ్‌ను దూరాన్ని బ‌ట్టి కొన్ని పేర్ల‌తో పిలుస్తారు.

యార్కర్ లెన్త్ - స్టంప్స్ నుంచి 2 మీటర్ల వరకు ( ఫుల్ టాస్ , యార్క‌ర్‌‌లు ఇందులోనే వ‌స్తాయి)
ఫుల్ లెన్త్ - స్టంప్స్ నుంచి 4 మీట‌ర్ల వ‌ర‌కు
గుడ్ లెన్త్ - స్టంప్స్ నుంచి 6 మీట‌ర్ల వ‌ర‌కు
షార్ట్ పిచ్ - స్టంప్స్ నుంచి 8 మీట‌ర్ల వ‌ర‌కు

ఇలా బ్యాట్స్‌మెన్ స్టాండింగ్ పొజిషన్‌ను బట్టి ముందుగానే సెట్ చేసుకున్న ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌కు తగ్గట్టు బౌలర్లు బంతిని వేస్తారు. (ఫుల్ లెన్త్, గుడ్ లెన్త్ , షార్ట్ పిచ్ )ను, లైన్ ( వికెట్ టు వికెట్ / ఆఫ్ సైడ్ / లెగ్ సైడ్) ను ఫిక్స్ చేసుకొని బంతిని వేయ‌డ‌మే లైన్ అండ్ లెన్త్

చేంజ్ ఆఫ్ పేస్: బంతి వేగాన్ని మార్చడమే చేంజ్ ఆఫ్ పేస్. ఒక బంతిని 145 కిలోమీటర్ల వేగంతో విసిరి ఆ మరుసటి బంతిని 155 కిలోమీటర్లు వేసినా.. లేక 135 కిలోమీటర్ల వేగంతో సంధించినా దాన్ని చేంజ్ ఆఫ్ పేస్ అంటారు. బౌలర్లు ఎక్కువగా ఇదే అస్త్రాన్ని వాడుతుంటారు. ఇలా వేగంలో మార్పు చేయడంలో వల్ల బ్యాట్స్‌మెన్ అయోమయానికి గురవుతూ ఔట్ అవుతుంటారు.

నీలానే గంగూలీ అనుకుంటే ఎక్కడ ఉండేవాడివి? ధోనీ స్పార్క్ కామెంట్స్‌పై దుమారం!నీలానే గంగూలీ అనుకుంటే ఎక్కడ ఉండేవాడివి? ధోనీ స్పార్క్ కామెంట్స్‌పై దుమారం!

Story first published: Tuesday, October 20, 2020, 16:21 [IST]
Other articles published on Oct 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X