న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ-డివిలియర్స్.. మీ ఆట కోమాలోకి వెళ్లినట్లుంది.. సెహ్వాగ్ సెటైర్స్

IPL 2020: Virender Sehwag says Virat Kohli-AB de Villiers partnership seemed to be in coma

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ ఆట తీరుపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. వారి భాగస్వామ్యం కోమాలోకి వెళ్లినట్లుందన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 'వీరూ కీ బైతక్' షో పేరిట సెహ్వాగ్.. ఆయా జట్ల ఆటతీరుపై సెటైర్లు పేల్చుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌పై స్పందించాడు. విరాట్,ఏబీడీ ఆటపై అవాక్కులు చెవాక్కులు పేల్చిన వీరూ.. ధోనీ సూపర్ కెప్టెన్సీని కొనియాడాడు.

ఆర్‌సీబీ ఓడేలా ఆడారు..

ఆర్‌సీబీ ఓడేలా ఆడారు..

విరాట్, డివిలియర్స్ నెమ్మదైన ఆట కారణంగానే ఆర్‌సీబీ ఓటమిపాలైందన్నాడు. స్టాండర్డ్ రన్‌రేట్ మెయింటేన్ చేయడంలో ఈ ఇద్దరు దిగ్గజాలు విఫలమయ్యారన్నాడు. ‘ఏందిది.. ఇంత ఘోరమా? 7వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు ఈ ఇద్దరు బ్యాటింగ్ చేశారు. వారి భాగస్వామ్యం కోమాలోకి వెళ్లినట్లుంది. వారి బ్యాటింగ్‌లో ఎలాంటి పవర్ లేదు. నేను నిద్రలో నుంచి లేచిన తర్వాత కూడా వారి బ్యాటింగ్ అలానే ఉంది. వారు ఎలాంటి బిగ్ షాట్స్ ఆడలేదు. 18 ఓవర్‌లో డివిలియర్స్ ఔటవ్వడంతో సీఎస్‌కే బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో ఆర్‌సీబీ 145/6 పరిమితమైంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక విరాట్, ఏబీడీ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

 ధోనీ ఈజ్ బ్యాక్..

ధోనీ ఈజ్ బ్యాక్..

ఇక సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై వీరూ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పేర్కొన్న సెహ్వాగ్‌.. అతన్ని ఫుల్‌ కెప్టెన్సీ మూడ్‌లో చూసిన మ్యాచ్‌ అని అభిప్రాయపడ్డాడు. పాత ధోనిని మరొకసారి చూశామని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో పాదరసంలో వ్యూహాలు పన్నుతూ ఆర్సీబీని ఇరకాటంలోకి నెట్టాడన్నాడు. ప్రధానంగా బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ తన మార్కు కెప్టెన్సీతో ధోనీ ఆకట్టుకున్నాడని సెహ్వాగ్‌ కొనియాడాడు. ముఖ్యంగా సాంట్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఒక మంచి నిర్ణయమన్నాడు. అదే సమయంలో దీపక్‌ చాహర్‌, సామ్‌ కరాన్‌లను డెత్‌ ఓవర్లలో వేయించడం ధోని కెప్టెన్సీ మూడ్‌లోకి రావడాన్ని చూపెట్టిందన్నాడు.

రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్

రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 50), ఏబీ డివిలియర్స్ (36 బంతుల్లో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌(65 నాటౌట్‌; 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)లతో రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

IPL 2020: అందుకే పంజాబ్ పంజా విసురుతోంది: సునీల్ గవాస్కర్

Story first published: Monday, October 26, 2020, 18:26 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X