IPL 2020: అందుకే పంజాబ్ పంజా విసురుతోంది: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 ఫస్టాఫ్‌లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెకండాఫ్‌లో అదరగొడుతుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్తోంది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనూ ఆఖరి బంతి వరకు అద్భుత పోరాటంతో విజయాలను సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆకట్టుకునే ప్రదర్శనకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీతోపాటు.. కోచ్ అనిల్ కుంబ్లే పోరాడేతత్వం కారణమని దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ పంజాబ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు.

రాహుల్ రాటు దేలాడు..
‘గెలిచే దారిని పంజాబ్ కనుగొంది. టోర్నీ ఆరంభంలో వారు విజయాలను సాధించలేకపోయారు. ప్రతిసారి విజయానికి చేరువగా వచ్చి ఓడారు. తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడారు. తర్వాత చివరి ఓవర్లలో పరాజయం పాలయ్యారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో వారు అద్భుతంగా ఆడారు. శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులే చేసిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించడం సంచలనం. పంజాబ్ ఆటగాళ్లు తమను తాము బలంగా నమ్మారు. జట్టును రాహుల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రాహుల్ ఎదిగాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలింగ్ మార్పు విషయంలో.. రాహుల్ రాటుదేలాడు.

కుంబ్లే పాత్ర కీలకం..
పంజాబ్ విజయాల్లో అనిల్ కుంబ్లే పాత్రను మరవొద్దు. క్రికెట్ కెరీర్ మొత్తం అతడు పోరాడాడు. దవడకు దెబ్బతగిలినా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగాడు. అదే ధీరత్వం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో కనిపిస్తోంది. వీరిద్దరి వల్లే అసాద్యమనుకున్న పరిస్థితుల్లో పంజాబ్ పుంజుకుంది. ప్లేఆఫ్స్ రేసులోనూ నిలిచింది.'అని గవాస్కర్ కొనియాడాడు.

మరో మూడు గెలిస్తే..
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన పంజాబ్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. నాలుగు వరుస విజయాలతో 10 పాయింట్లను సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే.. ఆ జట్టు ఫ్లేఆఫ్ చేరే అవకాశాలున్నాయి. తమ తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్ కేకేఆర్, చెన్నై, రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ మూడింటిలో విజయం సాధిస్తేనే టోర్నీ కొనసాగే అవకాశం ఉంటుంది. మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా ఒక్కటి ఓడినా పంజాబ్ నిష్క్రమించాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications