న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: అతనికి బౌన్సర్ వేయమని కోహ్లీ చెప్పాడు.. నేను వేయలేదు.. ఆ తర్వాత: సిరాజ్‌

IPL 2020: Virat Kohli asked me to bowl bouncer to Nitish Rana, but I pitched it up says Mohammed Siraj

అబుదాబి: బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిప్పులు చెరిగే పేస్‌తో విజృంభించడంతో కోల్‌కతా బ్యాటింగ్‌ కకావికలమైంది. హైదరాబాదీ పేస్‌ ధాటికి కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ (30) మినహా అంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆపై బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్‌ చేసిన తొలి బౌలర్‌గా ఐపీఎల్‌లో అరుదైన రికార్డును సిరాజ్‌ సొంతం చేసుకున్నాడు.

వరుస బంతుల్లో వికెట్లు

వరుస బంతుల్లో వికెట్లు

ఈ సీజన్లో పవర్ ప్లేలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో బౌలింగ్ చేయిస్తున్న ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మహ్మద్‌ సిరాజ్‌కు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఈ అవకాశాన్ని అందరూ గుర్తుపెట్టుకుని రీతిలో అతడు ఉపయోగించుకున్నాడు. బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణాలను పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్‌ మూడో బంతికి త్రిపాఠి (1) ఔట్ అయ్యాడు. వికెట్‌ కీపర్‌ ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన ఫామ్ బ్యాట్స్‌మన్‌ రాణా (0) బౌల్డ్‌ అయ్యాడు.

మనసు మార్చుకున్న సిరాజ్

మనసు మార్చుకున్న సిరాజ్

నితీష్ రాణా క్రీజ్‌లోకి రాగానే.. వికెట్ల దూరంగా బౌన్సర్ వేయమని మహ్మద్‌ సిరాజ్‌కు ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ సూచించాడట. అప్పుడు కెప్టెన్ చెప్పిన మాటకు ఓకే చెప్పిన సిరాజ్.. బౌలింగ్ చేయడానికి రనప్ తీసుకుంటున్న సమయంలో మనసు మార్చుకున్నాడు. వికెట్ల మీదకు బంతిని విసరాలని ఫిక్స్ అయ్యాడట. అనుకున్న విధంగానే బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం సిరాజ్ వెల్లడించాడు. 'రాణా క్రీజులోకి రాగానే.. విరాట్ భాయ్ నా వద్దకు వచ్చాడు. వికెట్ల దూరంగా బౌన్సర్ వేయమని చెప్పాడు. కానీ రనప్ తీసుకుంటున్న సమయంలో మనసు మార్చుకున్నా. ఆ తర్వాత కోహ్లీ ఈ విషయంపై చర్చించలేదు' అని సిరాజ్ చెప్పాడు.

ఎంతో ప్రాక్టీస్ చేశా

ఎంతో ప్రాక్టీస్ చేశా

'సన్‌రైజర్స్ తరఫున కొత్త బంతితో బౌలింగ్ చేసిన నాకు మళ్లీ ఇన్నాళ్లకు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఎంతో ప్రాక్టీస్ చేశా. కొత్త బంతితో బౌలింగ్ చేయించాలని కోహ్లీ ముందే అనుకోలేదు. మైదానంలోకి వచ్చాక బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండు అని నాతో అన్నాడు' అని సిరాజ్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవడంతో అందరూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ.. ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

 కొత్త బంతిని ఇవ్వడం ఆలస్యమైంది

కొత్త బంతిని ఇవ్వడం ఆలస్యమైంది

మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మహ్మద్‌ సిరాజ్ చేతికి కొత్త బంతిని ఇవ్వడం ఆలస్యమైంది. వాషింగ్టన్ సుందర్‌కు బంతిని ఇద్దామనుకున్నా కానీ పిచ్ పొడిగా ఉండటంతో మనసు మార్చుకున్నా. ఫస్ట్ ఓవర్ సుందర్‌తో బౌలింగ్ చేయించి.. రెండో ఓవర్ మోరీస్‌తో బౌలింగ్ చేయిద్దామనుకున్నా. మైదానంలోకి వచ్చాక మోరీస్‌, సిరాజ్‌లకు కొత్త బంతిని ఇచ్చా. సిరాజ్ బాగా బౌలింగ్ చేశాడు. గత ఏడాది అతడు సరిగా ఆడలేకపోవడంతో చాలా మంది విమర్శించారు. ఈసారి అతడెంతో కష్టపడుతున్నాడు. దానికి ప్రతిఫలం వస్తోంది' అని చెప్పుకొచ్చాడు.

KKR vs RCB: ఒకేఒక్కడు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్!!

Story first published: Thursday, October 22, 2020, 14:58 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X