Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: ఒకేఒక్కడు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్!!

IPL 2020, KKR vs RCB: Mohammed Siraj becomes first bowler to bowl two maiden overs in IPL
RCB VS KKR : Mohammed Siraj's 2 Maidens, 3 wickets Scripts History | First Bowler In IPL

అబుదాబి: ఐపీఎల్‌ 2020లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నై‌ట్‌రైడర్స్‌పై గెలిచింది. దేవదత్‌ పడిక్కల్‌ (25: 17 బంతుల్లో 3ఫోర్లు), గుర్‌కీరత్‌ సింగ్‌ మన్ ‌(21), విరాట్‌ కోహ్లీ (18) సత్తా చాటడంతో 85 పరుగుల సునాయాస లక్ష్యాన్ని బెంగళూరు 13.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.

తొలి బౌలర్‌గా చరిత్ర:

తొలి బౌలర్‌గా చరిత్ర:

ఈ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేస్ బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో సిరాజ్‌ ఏకంగా రెండు మెయిడిన్ ఓవర్లు వేశాడు. దీంతో ఐపీఎల్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా సిరాజ్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎవరూ కూడా రెండు మెయిడిన్ ఓవర్లు వేయలేదు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లోని రెండు, నాలుగో ఓవర్లను సిరాజ్‌ మెయిడిన్లుగా వేశాడు. ఒక పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు.

వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు:

వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు:

4-2-8-3.. ఇవి మహ్మద్‌ సిరాజ్‌ గణాంకాలు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం చాలా కష్టం. మొదటి స్పెల్‌లో సిరాజ్‌ వేసిన మూడు ఓవర్లలో తొలి రెండు ఓవర్లు మెయిడెన్‌ వేయడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలో ఒక బౌలర్‌ ఇలా వరుస రెండు ఓవర్లను మెయిడెన్‌గా వేయడం ఇదే తొలిసారి. సిరాజ్‌ ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది.

ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు:

ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు:

గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవడంతో అందరూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని సిరాజ్‌ నిలబెట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ.. ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టినంత వరకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదంటే సిరాజ్ ఎంతలా బ్యాట్స్‌మెన్‌పై రెచ్చిపోయాడో అర్ధం చేసుకోవచ్చు.

రెండో అత్యల్ప స్కోరు:

రెండో అత్యల్ప స్కోరు:

సిరాజ్‌ దెబ్బకు ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇంతకముందు 2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్‌ అయింది. 12 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీపై రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అయితే ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు ఆర్‌సీబీ పేరిట ఉంది. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 49 పరుగులే చేసింది.

KKR vs RCB: మహ్మద్‌ సిరాజ్ అదుర్స్.. కోల్‌కతాపై బెంగళూరు సునాయాస విజయం!!

Story first published: Wednesday, October 21, 2020, 23:53 [IST]
Other articles published on Oct 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+