న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఫస్ట్ వీక్ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లు దూరం.. ఈ విషయంలో ముంబై మాత్రం లక్కీ!

IPL 2020:Team-wise List of International Players Who will Miss First Week of Tournament in UAE

మెల్‌బోర్న్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్ ఆరంభ దశ మ్యాచ్‌లు చప్పగా సాగే అవకాశం కనిపిస్తోంది. ధనాధన్ లీగ్‌కు ప్రధాన ఆకర్షణ అయిన విదేశీ ఆటగాళ్లు.. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు తొలి వారంలో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాతే వీరు యూఏఈకి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ రెండు సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 21 మంది సభ్యులతో కూడిన జంబో జట్టును ప్రకటించింది. వీరిలో 12 మంది ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఈ టూర్ సెప్టెంబర్ 4న మొదలై 16న ముగుస్తుంది.

అడ్డుగా క్వారంటైన్ రూల్స్..

అడ్డుగా క్వారంటైన్ రూల్స్..

మరోవైపు ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19న మొదలవుతుంది. అయితే ఐపీఎల్‌ తాజా నిబంధనల ప్రకారం ఏ దేశంనుంచి క్రికెటర్లు యూఏఈకి వచ్చినా కచ్చితంగా వారం రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలి. ఆ వారంలో మొదటి, మూడు, ఆరో రోజుల్లో వారికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తారు. మూడు పరీక్షల్లో కూడా నెగిటివ్‌గా వస్తేనే జట్టుతో చేరి ప్రాక్టీస్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. కొన్ని ఫ్రాంచైజీలు ఇంగ్లండ్‌ నుంచి వచ్చే ఆటగాళ్ల క్వారంటైన్‌ సమయాన్ని తగ్గించాలంటూ ప్రత్యేక విజ్ఞప్తి చేసినా... దానిని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తిరస్కరించినట్లు తెలిసింది.

29 మంది ప్లేయర్లు..

29 మంది ప్లేయర్లు..

దీంతో ఇంగ్లండ్ , ఆసీస్ క్రికెటర్లు సెప్టెంబర్ 26 తర్వాతే బరిలోకి దిగనున్నారు. రెండు దేశాలకు చెందిన 29 మంది ప్లేయర్లకు ఐపీఎల్ కాంట్రాక్టులున్నాయి. వారిలో డేవిడ్‌‌ వార్నర్, బెన్‌‌ స్టోక్స్, పాట్ కమిన్స్‌‌, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్లున్నారు. ఆస్ట్రేలియాలాగే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా ఆలస్యంగానే తమ తమ ఐపీఎల్‌ జట్లతో చేరతారు. ఇంగ్లండ్‌నుంచి బెన్‌ స్టోక్స్, ఇయాన్‌ మోర్గాన్, జాస్‌ బట్లర్‌ సహా మొత్తం 13 మంది ఐపీఎల్‌ బరిలో నిలిచారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే అప్ కమింగ్ సిరీస్‌లకు ఇంగ్లండ్ కూడా తమ జట్టు ను ప్రకటిస్తే ఎవరెవరు యూఏఈకి ఆలస్యంగా వస్తారనే దానిపై మరింత క్లారిటీ రానుంది.

ముంబై జట్టు లక్కీ..

ముంబై జట్టు లక్కీ..

ఆసీస్ జట్టు ఇంగ్లండ్ టూర్ కారణంగా ముంబై ఇండియన్స్ తప్ప అన్ని ఫ్రాంచైజీలు ప్రభావితం కానున్నాయి. నాథన్ కౌల్టర్ నిల్, క్రిస్ లిన్ ముంబై టీమ్‌లో ఉన్నప్పటికి.. వారు ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికవ్వలేదు. ఇది ఆ జట్టుకు కలిసొచ్చింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఫస్ట్ వీక్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌లకు ముగ్గురు చొప్పున ఆటగాళ్లు దూరం కానుండగా.. అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ప్లేయర్ల సేవలను కోల్పోనుంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు చొప్పున, కింగ్స్ పంజాబ్‌కు ఒకరు దూరం కానున్నారు.

ఐపీఎల్ ఫస్ట్ వీక్ మిస్సవనున్న క్రికెటర్లు

ఐపీఎల్ ఫస్ట్ వీక్ మిస్సవనున్న క్రికెటర్లు

సన్ రైజర్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ , జానీ బెయిర్ స్టో

బెంగళూరు: మోయిన్ అలీ, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్ , కేన్ రిచర్డ్ సన్ ,

నైట్ రైడర్స్​: పాట్ కమిన్స్​, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్

పంజాబ్: మ్యాక్స్​వెల్

రాయల్స్: జోసబట్లర్, స్టీవ్ స్మిత్, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ , జాసన్ రాయ్, టామ్ కరణ్

ఢిల్లీ: అలెక్స్​ క్యారీ, స్టో యినిస్, క్రిస్ వోక్స్

చెన్నై: హాజిల్ వుడ్, సామ కరణ్

ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్, అలెక్స్‌ కారీ, కమిన్స్, హాజల్‌వుడ్, మార్నస్‌ లబ్‌షేన్, నాథన్‌ లయన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, రిలీ మెరిడిత్, జోష్‌ ఫిలిప్, సామ్స్, కేన్‌ రిచర్డ్సన్, స్టీవ్‌ స్మిత్, మిషెల్‌ స్టార్క్, స్టొయినిస్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్‌ వార్నర్, ఆడమ్‌ జంపా.

క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత.. 4 బంతుల్లో 4 వికెట్లు.!

Story first published: Saturday, August 15, 2020, 12:34 [IST]
Other articles published on Aug 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X