క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత.. 4 బంతుల్లో 4 వికెట్లు.!

లోయర్ ఆస్ట్రియా: మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదైంది. కర్ణాటక మాజీ పేసర్, ప్రస్తుత జర్మనీ కెప్టెన్ అనురాధ దొడ్డబళ్లాపూర్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. తద్వార మహిళా టీ20 క్రికెట్‌లో 'హ్యాట్రిక్ ప్లస్' వికెట్ తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో అనురాధ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆమె 2,3, 4, 5 బంతులకు వరుసగా వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో అనురాధ బౌలింగ్ గణాంకాలు 3-2-1-5గా ఉన్నాయి.
ముగ్గురు క్లీన్ బౌల్డ్..
ఈ దెబ్బకు ఆస్ట్రియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 61 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు 20 ఓవర్లలో 198 పరుగులు చేసిన జర్మనీ... 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అనురాధ ధాటికి జో-ఆంటోనిట్టే స్టిగ్లిట్జ్ (1), తుగ్సే కజాన్సి (0), అనిషా నూకల (0), ప్రియా సాబు (0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్టిగ్లిట్స్ ఒక్కతే క్యాచ్ ఔట్ కాగా.. మిగతా ముగ్గురు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ వెంటనే మరో వికెట్ తీసిన అనురాధ ఐదు వికెట్ల హాల్ అందుకుంది.
మూడో బౌలర్‌గా..
ఈ 4/4 ఫీట్‌తో అనురాధ.. శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ, ఆఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ సరసన చేరింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగా ఈ ఘనత సాధించగా.. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో రషీద్ ఖాన్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 18 సార్లు ‘హ్యాట్రిక్' నమోదైనా... ఇలా ఒక బౌలర్ 4 వికెట్లు పడగొట్టడం ఇది రెండో సారి. అనురాధ కన్నా ముందు రషీద్ ఖాన్ ఈ ఘనతను అందుకున్నాడు.

34 ఏళ్ల కింది మ్యాచ్..
ఇక అనురాధ 3-2-1-5 గణంకాలు చూస్తే 34 ఏళ్ల క్రితం 1986 చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్-శ్రీలంక మ్యాచ్ గుర్తొస్తోంది. ఈ మ్యాచ్‌లో విండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్(4.3-3-1-5) ఒకే పరుగు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో ఒక్కరే క్యాచ్ ఔట్ కాగా.. మిగతా అంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. వాల్ష్ ధాటికి ఆ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో పాటు చెత్త రికార్డును మూటగట్టుకుంది.
England vs Pakistan: చెలరేగిన బ్రాడ్, అండర్సన్ .. ప్యాకప్ అంచున పాక్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications