న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆన్ ఫైర్.. ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

IPL 2020, SRH vs DC: Sunrisers Hyderabad defeat Delhi Capitals by 88 runs

దుబాయ్: గెలిచే మ్యాచ్‌లో ఓడామన్న కసో ఏమో కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైర్ అయింది. ముందుగా బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ.. అనంతరం బౌలింగ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని గడగడలాడించింది. మొత్తానికి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించింది. మంగళవారం జరిగిన ఈ చావోరేవో మ్యాచ్‌లో హైదరాబాద్ 88 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా(45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), మనీష్ పాండే(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్ ) చెలరేగారు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. రిషభ్ పంత్(36), రహానే(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్(3/7) మూడు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ(2/27), నటరాజన్ (2/26) రెండేసి వికెట్లు తీశారు. నదీమ్, హోల్డర్, శంకర్‌కు తలో వికెట్ దక్కింది.

ఆదిలోనే గట్టి షాక్..

ఆదిలోనే గట్టి షాక్..

220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నదీమ్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే మార్కస్ స్టోయినిస్(5) కూడా వార్నర్‌కు చిక్కి నిరాశపరిచాడు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్‌(16)తో రహానే(26) బాధ్యతాయుతంగా ఆడటంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది.

వార్నర్ బౌలింగ్..

వార్నర్ బౌలింగ్..

ఆ వెంటనే వార్నర్ రషీద్ ఖాన్‌ను రంగంలోకి దింపగా.. ఫస్ట్ బాల్‌కే హెట్‌మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతికి రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది. రిషభ్ పంత్, అయ్యర్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. ఈ జోడీని విజయ్ శంకర్ ఆదిలోనే విడదీశాడు. 12వ ఓవర్‌లో అయ్యర్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఆఖరి బంతి వేసేముందు అతని తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. దాంతో డేవిడ్ వార్నర్ బౌలర్‌గా అవతారమెత్తాడు. చివరి బంతిని ఎట్టకేలకు పూర్తి చేశాడు. తొలి బంతి వైడ్ వేసినా మరుసటి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌లో వార్నర్ బౌలింగ్ చేయడం ఇదే ప్రథమం.

రషీద్ 4-0-7-3..

రషీద్ 4-0-7-3..

క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(1)ను రషీద్ ఔట్ చేయడంతో ఢిల్లీ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో రషీద్ ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసిన రషీద్.. 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది అతనికి అత్యుత్తం. ఇందులో 17 డాట్ బాల్స్ ఉన్నాయి. అనంతరం రబడా(3), పంత్(36) వరుస బంతుల్లో ఔటవ్వడంతో హైదరాబాద్ విజయం లాంఛనమైంది.

Story first published: Tuesday, October 27, 2020, 23:18 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X