న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#ThankYouMSDhoni: ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ధోనీపై గౌరవాన్ని చాటుకున్న బీసీసీఐ!

BCCI pays tribute to MS Dhoni as Team India gears up for first series post his retirement

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలోనే మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ దిగ్గజ ఆటగాడు ఆగస్టు 15న అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. సుమారు రెండున్నర నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనకు బీసీసీఐ 32 మందితో కూడిన జంబో జట్టును సోమవారం ప్రకటించింది. ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా.. బీసీసీఐ మహేంద్రుడిని ప్రశంసించింది. థ్యాంక్యూ ఎంఎస్ ధోనీ అనే హ్యాష్ ట్యాగ్‌, మహీ ఫొటోతో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ కవర్ ఫొటోలను మార్చేసింది.

BCCI pays tribute to MS Dhoni as Team India gears up for first series post his retirement

ధోనీ సేవలకు గుర్తుగా బీసీసీఐ ఇలా గౌరవం ఇవ్వడం పట్ల మహేంద్రుడి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. బీసీసీఐపై ప్రశంసలు గుప్పిస్తూ... ట్వీట్లు చేస్తున్నారు. దాంతో #ThankYouMSDhoni ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక ఏడాది కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ.. ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ చాలా కాలంగా క్రికెట్ ఆడకపోవడంతో.. టచ్‌లోకి రావడానికి మహీ ఇబ్బంది పడుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండమే కాకుండా.. తొలిసారి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఆ సీజన్‌లో కూడా చెన్నైని ధోనీనే నడిపిస్తాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అంపైర్ ఘోర తప్పిదం.. నిబంధనలకు విరుద్దంగా డేవిడ్ వార్నర్‌కు సాయం!అంపైర్ ఘోర తప్పిదం.. నిబంధనలకు విరుద్దంగా డేవిడ్ వార్నర్‌కు సాయం!

Story first published: Wednesday, October 28, 2020, 17:33 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X